డీఎంఎఫ్‌టీ నిధులను మండల అభివృద్ధికే ఉపయోగించాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:26 AM
మండ లంలో సిమెంటు కంపెనీ, సింగరేణి లాంటి పెద్ద పరిశ్రమలు ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం కాసిపేట మండలం ఇంకా వెనకబడి ఉందని, మండల అభివృద్థికి డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులను స్థానికంగానే వినియో గించేందుకు ఆదివాసీ సర్పంచులందరు సమష్టిగా పోరా టం చేయాలని ఆదివాసీ తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మడావి వెంకటేశ్వర్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మడావి వెంకటేశ్వర్
కాసిపేట, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మండ లంలో సిమెంటు కంపెనీ, సింగరేణి లాంటి పెద్ద పరిశ్రమలు ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం కాసిపేట మండలం ఇంకా వెనకబడి ఉందని, మండల అభివృద్థికి డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులను స్థానికంగానే వినియో గించేందుకు ఆదివాసీ సర్పంచులందరు సమష్టిగా పోరా టం చేయాలని ఆదివాసీ తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మడావి వెంకటేశ్వర్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాసిపేట ఆదివాసీ మండలం అని, మండలంలోని గిరిజన గూడాలు, కంపెనీ ప్రభావిత గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మండలంలో ఆదాని సిమెంటు కంపెనీ, సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి కానీ వీటి నుంచి వచ్చే డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులను రాజదాని ప్రాంతానికి, గిరిజనేతర సుదూర ప్రాంతాల గ్రామాల అభి వృద్ధికి తరలించి ఖర్చు చేస్తున్నారని, కాసిపేట మండలాన్ని పట్టించుకోవడం లేద ని ఆవేదన వ్యక్తం చే శారు. సిమెంటు కం పెనీ నుంచి వెలువడే దుమ్ము ధూళికి ఇక్కడి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతు న్నారని, పంటలు కూడా నష్టపోతున్నాయని తెలిపారు. కానీ కంపెనీ ఇచ్చే నిధులు మాత్రం మంత్రుల ఇలాఖాల్లో ఖర్చు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. పరిశ్రమల వల్ల నష్టపోతున్న ప్రజ లకే నిధులు ఖర్చు చేయాలన్నారు. ఆదివాసీల సమస్యల పై తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు చేస్తామన్నారు. సమావేశంలో నాయకులు మల్లేష్ తదిత రులు పాల్గొన్నారు.