Share News

kumaram bheem asifabad- ఘనంగా దివ్వెల పండుగ

ABN , Publish Date - Oct 21 , 2025 | 10:30 PM

జిల్లా వ్యాప్తంగా సోమవారం దీపావళి సందడి నెల కొంది. జిల్లా ప్రజలు ఘనంగా వేడుకలు చేసుకున్నారు. పండుగ సందర్భంగా ఇళ్లు, దుకాణాలను దీపాలతో అలంకరించారు. భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవీ పూజలు నిర్వహిం చారు. చిన్నాపెద్దా అంతా కలిసి బాణాసంచా కాల్చుతూ ఉల్లాసంగా పాల్గొన్నారు.

kumaram bheem asifabad- ఘనంగా దివ్వెల పండుగ
కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

- భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవీ పూజలు

ఆసిఫాబాద్‌ , అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా సోమవారం దీపావళి సందడి నెల కొంది. జిల్లా ప్రజలు ఘనంగా వేడుకలు చేసుకున్నారు. పండుగ సందర్భంగా ఇళ్లు, దుకాణాలను దీపాలతో అలంకరించారు. భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవీ పూజలు నిర్వహిం చారు. చిన్నాపెద్దా అంతా కలిసి బాణాసంచా కాల్చుతూ ఉల్లాసంగా పాల్గొన్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాలతో పాటు రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, తిర్యాణి, సిర్పూర్‌(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూరు, పెంచికలపేట, దహెగాం మండలాల్లో దీపావళి పండగను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో వ్యాపార, వాణిజ్య సమూదాయాలు విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. పండుగను పురష్కరించుకొని మహిళలు తమ తమ ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేశారు. బాణాసంచా విక్రయ కేంద్రాలు కిక్కిరిసి పోయాయి. వివిధ రకాల టపాసులు కొనుగొలు చేసేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా దుకాణాల వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు బాణసంచా పెల్చడంతో బాంబుల మోతతో జిల్లా కేంద్రం మారు మోగింది ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చతూ వేడుకల్లో పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణంలో ఉదయం నుంచి భక్తులు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో లక్ష్మీ పూజలు నిర్వహించారు. అనంతర పెద్ద ఎత్తున బాణాసంచాను కాల్చి పండుగ శుభాకాంక్షలు ఒకరినొకరు తెలుపుకున్నారు. స్థానిక పొట్టి శ్రీరాములు చౌరస్తాలో నరకసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిదండి చినజీయర్‌స్వామి, ఎమ్మెల్యే హరీష్‌బాబు మాట్లాడుతూ మనలోని చెడు మీద విజయం రోజే దీపావళి పండుగ అన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రాచకొండ గిరిష్‌, వ్యాపారస్థులు గణపురం ప్రకాష్‌, కమల్‌ కిషోర్‌ బంగ్‌, జగదీష్‌ అసావా, హనుమాన్‌ అసావా, బంకట్‌ అసావా, జి.ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. పట్టణ సీఐ ప్రేం కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): సిర్పూర్‌(టి) మండల వ్యాప్తంగా వ్యాపార సంస్థల్లో, ఇళ్లలో లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నలు పెద్దలు తేడా లేకుండా ఆనందోత్సవాల మధ్య బాణాసంచా కాల్చారు. పండుగను పురస్కరించుకుని మండల కేంద్రానికి చెందిన హెచ్‌పీ గ్యాస్‌ డీలర్‌ ఖుర్షిద్‌ హుస్సేన్‌ వినియోగదారులకు స్వీట్లు పంపిణీ చేసి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆలయాల్లో దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం బాణాసంచా పేల్చి ఉత్సాహం పాల్గొన్నారు. రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా ప్రజలు దీపావళి వేడుకులు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగి చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామాల్లో ఉత్సహంగా టపాసులు కాల్చారు. వ్యాపారులు లక్ష్మీపూజలు నిర్వహించారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా సోమవారం దీపావళి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం కేదారేశ్వర నోములు నోచుకున్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): వాంకిడి మండలంలో సోమవారం దీపావళి పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాంకిడి ఎస్సై మహేందర్‌ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలో సోమవారం దీపావళి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం ఆదివాసీలు తమ సంప్రదాయం ప్రకారం గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవెద్యం సమర్పించారు.

Updated Date - Oct 21 , 2025 | 10:30 PM