Share News

శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే సహించం

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:33 PM

పంచాయతీ ఎన్నికల నేప థ్యంలో శాంతిభద్రతలకు ఎవరైన విఘాతం కలిపిస్తే ఉపేక్షించే పరిస్థితి ఉం డబోదని కఠిన శిక్షలు ఉంటాయని సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు.

శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే సహించం

సీఐ శశిధర్‌రెడ్డి

మందమర్రిటౌన్‌, డిసెంబరు5 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నేప థ్యంలో శాంతిభద్రతలకు ఎవరైన విఘాతం కలిపిస్తే ఉపేక్షించే పరిస్థితి ఉం డబోదని కఠిన శిక్షలు ఉంటాయని సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు. శనివారం మం దమర్రి పోలీసుస్టేషన్‌లో రౌడీషీటర్ల కౌన్సిలింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల నియమాలను రౌడీషీటర్లు కూడ పాటించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్థులకు మ ద్దతుగా వెళ్లి ఏవైన గొడవలు పెట్టిన, ఆ పంచాయతీల్లోకి వెళ్లి ఎవరితోనైన మాట్లాడిన ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై మరిన్ని కేసులు నమో దు అవుతాయన్నారు. ప్రతీ ఒక్కరు డస్‌ అండ్‌ డోంట్స్‌ గురించి తెలుసుకో వాలన్నారు. చట్టవిరుద్దమైన కార్యకాలాపాలకు పాల్పడి ప్రజలను బెదిరించిన ప్రలోభాలకు గురి చేసిన అట్టి రౌడిషీట్‌ తొలగించే పరిస్థితి ఉండబోదని తెలి పారు. తాము చెప్పే అంశాలను దృష్టిలో పెట్టుకొని రౌడీ షీటర్లు వారి పనులు వారు చేసుకోవాలని అన్నారు. ఈ నెల 15న మందమర్రి మండలంలో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రౌడీషీటర్లంద రికి పై అధికారుల మేరకు పరి స్థితులు వివరిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మందమర్రి ఎస్‌ఐ రాజశే ఖర్‌, కాసిపేట ఎస్‌ఐ ఆంజనేయులు, రామకృష్ణాపూర్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌లు పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 11:33 PM