kumaram bheem asifabad- తెలంగాణ విమోచనంలో జిల్లా యోధులు
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:10 PM
నిజాం పాలన విముక్తి పోరాటంలో ఆసిఫాబాద్ ప్రాం త సమర యోధుల పోరాటం మరువలేనిది. ఆసిఫాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు మహారాష్ట్రలోని చంద్రాపూర్ మిటలరీ శిక్షణ క్యాంపులో చేరి సాయుధ శిక్షణను పొందారు. మిలటరీ పంజాబ్ రేజిమెంట్ లేజర్ పీఎస్ గహున్ శిక్షణను అందించారు. అక్కడ క్యాంపు ఇన్‌చార్జి గోపాల్ శాస్ట్రి బేకర్, బల్లార్షా క్యాంపు ఇన్‌చార్జిగా కేవీ కేశవులు వ్యవహరించగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ క్యాంపులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆసిఫాబాద్‌కు చెందిన చీల శంకర్, చీల విఠల్, కాండ్రె శంకర్, చందన్‌వార్ విఠల్, జగన్నాథ్, రేవయ్య, రాంసింగ్, నాగేంద్రయ్య, తిరుపతి, వెంకటేశంలు సాయుధ శిక్షణ శిబిరంలో ఏడాది పాటు శిక్షణ పొందుతూ సాయుధ పోరాటాన్ని నిర్వహించారు.
- ఏడాది పాటు మిలటరీ శిక్షణ పొందిన జిల్లా వాసులు
- తిరగబడిన కుమరం భీం
- నేడు తెలంగాణ విమోచన దినం
ఆసిఫాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నిజాం పాలన విముక్తి పోరాటంలో ఆసిఫాబాద్ ప్రాం త సమర యోధుల పోరాటం మరువలేనిది. ఆసిఫాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు మహారాష్ట్రలోని చంద్రాపూర్ మిటలరీ శిక్షణ క్యాంపులో చేరి సాయుధ శిక్షణను పొందారు. మిలటరీ పంజాబ్ రేజిమెంట్ లేజర్ పీఎస్ గహున్ శిక్షణను అందించారు. అక్కడ క్యాంపు ఇన్‌చార్జి గోపాల్ శాస్ట్రి బేకర్, బల్లార్షా క్యాంపు ఇన్‌చార్జిగా కేవీ కేశవులు వ్యవహరించగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ క్యాంపులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆసిఫాబాద్‌కు చెందిన చీల శంకర్, చీల విఠల్, కాండ్రె శంకర్, చందన్‌వార్ విఠల్, జగన్నాథ్, రేవయ్య, రాంసింగ్, నాగేంద్రయ్య, తిరుపతి, వెంకటేశంలు సాయుధ శిక్షణ శిబిరంలో ఏడాది పాటు శిక్షణ పొందుతూ సాయుధ పోరాటాన్ని నిర్వహించారు.
- జిల్లా కేంద్రంగా ఆసిఫాబాద్..
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా 1940 వరకు కొనసాగింది. ఈ సమయంలో పలువురు బ్రిటీష్ పాలన వ్యతిరేక పోరాటం, వందేమాతరం, క్విట్ ఇండియా ఉద్యమాలు, హిందీ మహాసభ ప్రచారం జరిపి జైలు జీవితం అనుభవించిన స్ఫూర్తితో 1947 నుంచి 1948 సంవత్సరాల్లో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టి పోరాటం చేసేందుకు బీజం పోసింది. ఆసిఫాబాద్ ప్రాంతం నుంచి చీల శంకర్, చీల విఠల్, రాంసింగ్, కాండ్రె శంకర్, రేవయ్య, నాగేంద్రయ్య, బోనగిరి వెంకటేశం, చందావార్ విఠల్, కాటెపల్లి తిరుపతి, జగన్నాథ్‌లు అజ్ఞాతంలోకి వెల్లి మహారాష్ట్రలోని చాందలో నిర్వహించిన సాయుధ శిక్షణ శిబిరంలో ఏడాది కాలం పాటు శిక్షణ పొందుతూ వివిధ సంఘటనల్లో పాల్గొన్నారు. భారత సైనిక దళాలకు అండగా ఉంటూ ప్రాణాలకు తెగించి రణరంగంలో దూకిన ఆసిఫాబాద్ సమరయోథులు నిజాం లొంగు బాటుకు దరూర్ రైల్వే స్టేషన్ విధ్వంసం చేసిన సంఘటనలో పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో కలిపేందుకు అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఆదేశాలతో 13.09.1948 పోలీసు యాక్షన్ ప్రకటితమైంది. మహారాష్ట్ర సైనిక దళాలు చాందా, బల్లార్షా క్యాంపుల్లో సుక్షితులైన ఆసిఫాబాద్ యోథులు రజాకార్లను మట్టుపెట్టేందుకు ముందుకు సాగారు. ఈ పోరాటం హోరాహోరిగా జరిగింది. సెప్టెంబర్ 14న బల్లార్షా సాస్రి ప్రాంతంలో జరిగిన పోరాటంలో 10 మంది నిజాం వ్యతిరేక ఉద్యమ కారులు మరణించారు. సెప్టెంబర్ 15న సైనిక దళాలు మాణిక్‌ఘడ్ పోలీసు అవుట్ పోస్టుపై దాడి చేశారు. సెప్టెంబర్ 16న సిర్పూర్, బెజ్జూరు అవుట్ పోస్టులు భారత సైనిక పరమయ్యాయి. సెప్టెంబర్ 17న నిజాం సర్కార్ సైన్యానికి తలోగ్గి హైదరాబాద్ సంస్థాన్ భారత్‌లో విలీనం అయింది. సెప్టెంబర్ 18న ఆసిఫాబాద్ జిల్లా జైలులోని 200 మంది ఖైదీలు గేట్లు విరగొట్టుకుని బయటకు వచ్చారు. నిజాం ప్రభుత్వాన్ని భారత దేశ సంస్థానంలో విలీనం చేసేందుకు ఆసిఫాబాద్ సమరయోధుల కృషి ఎంతో ఉంది.
- దోపిడీ వ్యవస్థ..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాడు నిజాం నిలువు దోపిడీ వ్యవస్థ కొనసాగింది. రజాకార్ల అరాచకాలు పరాకాష్టకు చేరాయి. అరకపట్టి, మంచెపట్టి, బంచరాయి లాంటి పన్నులతో గిరిజన రైతులను దోచుకున్నారు. అడవి బిడ్డలకు అడవిపై హక్కులు లేవన్నారు. ఈ నేపథ్యంలో సాయుధ పోరుకు దిగిన కుమరం భీం నిజాంపై విరోచితంగా పోరాడి వీర మరణం పొందారు. జిల్లా గిరిజనుల్లో పోరాట స్ఫూర్తి నింపారు. గిరిజన హక్కుల కోసం తిరుగుబాటు నేర్పారు. భీం పోరాట స్పూర్తితోనే ఈ ప్రాంతంలో వం దలాది మంది యువకులు నిజాంపై తుపాకీ ఎక్కు పెట్టారు. జిల్లాలో గిరిజన హక్కుల పోరాటం, భారత స్వాతంత్య్ర పోరాటం, ప్రత్యేక తెలంగాణ పోరాటం చరిత్రలో ప్రముఖంగా నిలిచాయి. గొప్ప పోరాట నేపథ్యం ఉన్న జిల్లాలో స్వాతంత్య్ర పోరాటంలో హైదరాబాద్ విలీనం పోలీసు యాక్షన్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీతో పాటు వందలాది మంది సమరయోధులు పోరాడి భావితరానికి స్పూర్తిగా నిలిచారు.
- బాపూజీ కల సాకారం..
భారత స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు నిజాం నిరంకుశత్వం నుంచి హైదరాబాద్ విలీన సాయుధ పోరులో కొండాలక్ష్మణ్ బాపూజీ ప్రముఖ పాత్ర పోషించారు. పోరాట యోధుడు, ఆసిఫాబాద్ ప్రథమ శాసన సభ్యుడు కొండాలక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్ నియోజక వర్గంలోని వాంకిడిలో 1915 సెప్టెంబర్ 27న జన్మించారు. ఆసిఫాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని రాజురాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్య అభ్యసించారు. హైదరాబాద్‌లోని సిటీ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యూలేషన్ పూర్తి చేశారు. అక్కడే డిప్లొమా లా కోర్సులో చేరి 1945లో పూర్తి స్థాయి లా పట్టాను పొందారు. హైకోర్టు న్యాయవాదిగా పని చేశారు. 1952లో ఆసిఫాబాద్ నియోజక వర్గం నుంచి జనరల్ కోటా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమం, స్వాతంత్య్ర పోరు, నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడానికి జరిగిన పోరాటంలో ప్రముఖ పాత్ర పోశించిన వారిలో కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్యుడు. 1969 నుంచి కొనసాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. 2008 నవంబర్‌లో ఆయన ప్రత్యేక తెలంగాణను తమకు తాము ప్రకటించుకొంటామని సంచలన ప్రకటన చేశారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ సాయుధ సమితిని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాజకీయ జేఏసీ, టీఆర్‌ఎస్‌లతో ఇతర రాజకీయ పార్టీల విధానాలతో ఆయన విభేధించారు. నవ తెలంగాణ ప్రజాపార్టీని ప్రకటించారు. 96 ఏళ్ల వయస్సులోనూ ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు కూ ర్చుకున్నారు. 2012 సెప్టెంబరు 22న ఆయన మరణించే వరకు తెలంగాణ సాధన కోసం కృషి చేశారు.
- ప్రజాపాలన దినోత్సవంగా..
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 17 తెలంగాణ విమో చన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజాపాలన దినోత్స వంగా పరిగణిస్తూ వేడుకలను నిర్వహిస్తోంది. జిలా ్లలో ప్రజాపాలన దినోత్సతవాన్ని నిర్వహించేందుకు అధికారులు కలెక్టరేట్‌లో ఏర్పాటు పూర్తి చేశారు. జిల్లాకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ప్రజాపాలన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.