Share News

జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎంపిక

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:40 PM

వాలీబాల్‌ అసో సియేషన్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవం గా ఎన్నుకున్నట్లు జిల్లా వాలీ బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కా ర్యదర్శి పశుల వెంకటేశ్‌ తెలిపా రు.

జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎంపిక
వాలీబాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పశుల వెంకటేశ్‌

కందనూలు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : వాలీబాల్‌ అసో సియేషన్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవం గా ఎన్నుకున్నట్లు జిల్లా వాలీ బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కా ర్యదర్శి పశుల వెంకటేశ్‌ తెలిపా రు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప రిషత్‌ బాలుర పాఠశాల ఆవర ణలో ఆదివారం జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ పదవీ కాలం ము గియడంతో తిరిగి నూతన కార్యవర్గాన్ని ఎన్ను కున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా వాలీబాల్‌ అసోసి యేషన్‌ ఎన్నికలకు ఎన్నికల పరిశీలకు లుగా తెలంగాణ రాష్ట్ర వాలీబాల్‌ అసోసియేషన్‌ సభ్యులు హనీఫ్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ పరిశీలకులుగా చిన్న వీరయ్య, జిల్లా డీవైఎస్‌వో అమర్‌ స్పోర్ట్స్‌ పరిశీలకులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో నాగర్‌కర్నూల్‌ డివిజన్‌ ఒలింపిక్‌ అసోసియే షన్‌ ప్రధాన కార్యదర్శి కొత్త యాదగిరిరావు, జి ల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నరసింహ, జిల్లా ఖోఖో అసోసియేషన్‌ ఇన్‌చార్జి, స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ డైరెక్టర్లు సామ ర వేష్‌, బి.రాజన్‌గౌడ్‌, పీఈటీలు ఎం.రవికుమార్‌, సత్యనారాయణ, కృష్ణ, మాజీ కౌన్సిలర్‌ ఆలూరి నరేందర్‌, క్రీడాకారులు శ్రీశైలం, ఆనంద్‌, గణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 11:40 PM