Share News

జల సంరక్షణలో జిల్లా టాప్‌...

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:18 PM

జల సంరక్షణ పకడ్బంధీగా చేపట్టి, భూగర్భ జలాలు పెంపొం దించడంలో జిల్లాకు జాతీయ స్ధాయిలో గుర్తింపు సాధిం చింది. అధికారులు, ప్రజల సమిష్టి కృషితో ప్రత్యేక ప్రణా ళిక అమలు చేయగా, జాతీయ స్థాయిలో మూడో స్థానం సాధించింది.

జల సంరక్షణలో జిల్లా టాప్‌...
కోటపల్లి మండలంలో బోర్‌ రీచార్జ్‌ కోసం చేపట్టిన నిర్మాణం

-భూగర్భ జలాలు పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక

-జాతీయ స్థాయిలో మూడో స్థానం కైవసం

-ప్రజలు, అధికారుల సమిష్టి కృషితో అందలం

-రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్‌

మంచిర్యాల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): జల సంరక్షణ పకడ్బంధీగా చేపట్టి, భూగర్భ జలాలు పెంపొం దించడంలో జిల్లాకు జాతీయ స్ధాయిలో గుర్తింపు సాధిం చింది. అధికారులు, ప్రజల సమిష్టి కృషితో ప్రత్యేక ప్రణా ళిక అమలు చేయగా, జాతీయ స్థాయిలో మూడో స్థానం సాధించింది. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడంలో చేపట్టిన చర్యలకుగాను కేంద్రం జల సంరక్షణ కింద జారీ చేసిన అవార్డుల్లో భాగంగా జల్‌ సంచయ్‌-జన్‌ భా గీదారి పురస్కారం జిల్లాకు దక్కింది. దేశంలోని దక్షిణ విభాగంలో జిల్లా మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఈ మేరకు ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో ఈ నెల 18న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, డీఆర్డీవో కిషన్‌ రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు.

క్రమంగా పెరిగిన నీటి వినియోగం....

జిల్లాలోని 16 మండలాల్లో 2024-25 సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం, ప్రధాన మంత్రి కృషి సం చాయ్‌ యోజన ద్వారా భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ కోసం 84,482 పనులు చేపట్టారు. 1970కు పూ ర్వం గ్రామాలు ప్రధానంగా సాంప్రదాయ నీటి వినియో గం కోసం బావులు, కుంటలు, నదీ జలాలపై ఆధారపడే వి. ఆ సమయంలో బోర్లు లేకపోవడం వల్ల భూగర్భ జ లాల వెలికితీత తక్కువగా ఉండేది. వ్యవసాయం కోసం రైతులు ఎక్కువగా రుతుపవనాలు, సాంప్రదాయ నీటి కుంటలపై ఆధారపడేవారు. రెండు దశాబ్దాల అనంతరం బోర్‌వెల్‌ డ్రిల్లింగ్‌ టెక్నాలజీ అందుబాటులోకి రావడం వ్యవసాయ పనులకు ప్రధాన నీటి వనరుగా మారింది. దీనికి తోడు పారిశ్రామిక అభివృద్ది కూడా నీటి డిమాండ్‌ ను క్రమంగా పెంచింది. అధిక నీటి వినయోగం వల్ల కాల క్రమంలో భూగర్భ జల స్థాయిల్లో మార్పులు ప్రా రంభమయ్యాయి. మరో రెండు దశాబ్దాలు 1990-2010 మధ్య కాలంలో సింగరేణి కాలరీస్‌ విస్తృతమై ఓపెన్‌ కాస్ట్‌, భూగర్భ గనుల కార్యకలాపాలు, పారిశ్రామిక అభి వృద్ధి కారణంగా జిల్లాలో భూగర్భ జలాలపై పెద్ద ప్ర భావం చూపింది. ఈ కారణంగా జిల్లాలో భూగర్భ జ లాలు కాల క్రమేణ తగ్గుముఖం పడుతుండటంతో వా టిని పెంచడానికి కేంధ్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టి, పకడ్బంధీగా అమలు చేయడం సత్ఫలితాలను ఇచ్చింది.

కార్యక్రమం అమలు ఇలా....

భూగర్భ జలాల పెంపుకోసం నీటిపారుదల, భూగర్భ జల శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొం దించి అమలు చేయడంతో సత్ఫలితాలను ఇచ్చింది. ము ఖ్యంగా దండేపల్లి, లక్షెట్టిపేట, కాసిపేట, కోటపల్లి, మం చిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి వంటి మండలాల్లో భూ గర్భ జలాల స్థాయిలు హెచ్చుతగ్గులను చూపుతుం డటంతో కేంధ్ర ప్రభుత్వ జలశక్తి అభియాన్‌ కింద జల సంరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. పై రెం డు శాఖల ప్రణాళికలో భాగంగా చెక్‌ డ్యామ్‌లు, ఊట కుంటలు, సాగునీటి కాలువల మరమ్మతు, ఎత్తు ప్రాం తాల్లో నేల తేమ పరిరక్షణ పనులు, నీటి నిల్వ కందకాల తవ్వకం, తదితర 13 రకాల పనులను చేపట్టడంతో స త్ఫలితాలను ఇచ్చి జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తిం పును తెచ్చింది.

జిల్లాలో చేపట్టిన పనుల వివరాలు....

జల సంచయ్‌, జన్‌ భాగీరథీ కార్యక్రమం కింద జి ల్లాలో మొత్తం 83,703 పనులు చేపట్టారు. వాటిలో వ్యక్తి గత ఇంకుడు గుంతలు 43,545, సామూహిక ఇంకుడు గుంతలు 5372, రూప్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్షర్స్‌ (వర్షపు నీటిని నిల్వ చేయడం), 265 బోర్‌వెల్‌ రీచార్స్‌ స్ట్రక్షర్స్‌, 23,589 పెర్కొలేషన్‌ ట్యాంక్స్‌ (వర్షపునీరు అక్కడికక్కడే నిలిచి ఉండే విధంగా), 7421 చిన్న తరహా నీటి కుంటల ని ర్మాణం, 4018 ట్రెంచ్‌ల నిర్మాణం ద్వారా భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, అమలు చేయడంతో జిల్లాలో లక్ష్యం నెరవేరింది.

స్పష్టమైన లక్ష్యంతోనే సాధ్యపడింది...

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

జల్‌ సంచాయ్‌-జన్‌ భాగీదారి కార్యక్రమంలో భాగం గా జిల్లాలో చేపట్టిన పనులకు కేంధ్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ అవార్డు అందుకోవడం సంతోషకరమైన విషయం. స్పష్టమైన లక్ష్యం, వివిధ శాఖల అధికారులు, రైతులు, ప్రజల సహకారంతో పనులను నిర్ణీత సమయంలో పూ ర్తి చేశాం. నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా భూగర్భ జలాలను మెరుగు పరచడం జరిగింది. సమిష్టిగా అంకితభావడంతో కూ డిన సేవకుగాను అవార్డు లభించింది. ఇదే స్పూర్తితో జ ల్‌ సంచాయ్‌-జన్‌ భాగీదారి 2.0లోనూ జాతీయస్థాయి లో ప్రథమ స్థానాన్ని పొందేందుకు ప్రణాళికబద్ధమైన ప్రయత్నాలు చేస్తాం.

Updated Date - Nov 22 , 2025 | 11:18 PM