మత్స్య సంఘాలకు చేప పిల్లల పంపిణీ
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:05 PM
నస్పూర్, సీతారాంపల్లి, మంచిర్యాల చెరువులు, కుంటల్లో చేపల పిల్లల పెంపకం కోసం ఆది వారం 2.90 లక్షల వివిధ రకాల చేప పిల్లలను మత్య్స సహకార సం ఘాలకు అధికారులు పంపిణీ చేశారు. మత్య్సకారుల జీవనోపాధి మె రుగు పర్చేందుకు ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను సరఫరా చేస్తుం ది.
ఉద్యోగులతో వాదన, దాడికి యత్నంచిన ఇద్దరు వ్యక్తులు...
నస్పూర్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : నస్పూర్, సీతారాంపల్లి, మంచిర్యాల చెరువులు, కుంటల్లో చేపల పిల్లల పెంపకం కోసం ఆది వారం 2.90 లక్షల వివిధ రకాల చేప పిల్లలను మత్య్స సహకార సం ఘాలకు అధికారులు పంపిణీ చేశారు. మత్య్సకారుల జీవనోపాధి మె రుగు పర్చేందుకు ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను సరఫరా చేస్తుం ది. నస్పూర్ చెరువు మత్య్సకారులకు చేప పిల్లలను పంపిణీ కోసం ఆదివారం మత్య్స శాఖ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రావణ్ కుమార్‌తో పాటు తో టి ఉద్యోగులు, సిబ్బంది వెళ్లారు. అయితే ఉచిత చేప పిల్లలను తీసు కెళ్లిన వాహనం తిరిగి వెళుతుండగా తమకు సమాచారం ఇవ్వలే దని ఇద్దరు వ్యక్తులు అడ్డగించి వారితో వాదనకు దిగారు.. దీంతో చె రువు వద్ద ఉన్న మిగిలిన ఉద్యోగులకు వాహనంలో ఉన్న రాజాబా బు సమాచారం ఇవ్వడంతో మత్య్స శాఖ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రావణ్ కు మార్ ఇతర ఉద్యోగులతో కలిసి వాహనం వద్దకు చేరుకున్నారు. అ క్కడకు చేరుకున్న ఫీల్డ్ అసిస్టెంట్‌తో సదరు వ్యక్తులు వాదనకు ది గారు. నానా బూతులు తిడుతూ దాడికి యత్నించడంతో అధికారులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. అనంతరం 100కు డయల్ చేసి జరిగిన విషయాన్ని చెప్పినట్లు తెలిపారు. ఇక్కడ జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై ఇద్దరు వ్యక్తులు శంకర్, నర్సయ్యలపై నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసినట్లు శ్రావణ్ కుమార్ తెలిపారు.