kumaram bheem asifabad- ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ
ABN , Publish Date - Dec 28 , 2025 | 10:19 PM
మండలంలోని చోర్‌పల్లి గ్రామ పంచాయతీలో ఎస్సీ నితికా పంత్, సీఐ రమేశ్ ఆదేశాల మేరకు పోలీసులు మీకోసంలో భాగంగా 200 మంది నిరుపేద ఆదివాసీ కుటుంబాలకు ఆదివాకం ఎస్సై గంగన్న దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ 15 రోజులుగా లింగాపూర్, సిర్పూర్(యు) మండలాల్లో చలీ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
లింగాపూర్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చోర్‌పల్లి గ్రామ పంచాయతీలో ఎస్సీ నితికా పంత్, సీఐ రమేశ్ ఆదేశాల మేరకు పోలీసులు మీకోసంలో భాగంగా 200 మంది నిరుపేద ఆదివాసీ కుటుంబాలకు ఆదివాకం ఎస్సై గంగన్న దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ 15 రోజులుగా లింగాపూర్, సిర్పూర్(యు) మండలాల్లో చలీ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారని అన్నారు. ముఖ్యంగా వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నందున చలి నుంచిరక్షణకు దుప్పట్లు అందజేస్తున్నామని అన్నారు. పోలీసులు ప్రజల భద్రతతో పాటు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు సమాచారం ఇస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో చోర్‌పల్లి సర్పంచ్ అనుసూయాజుగాదిరావు, గ్రామపటేల్ జంగు, ఉపసర్పంచ్ నీలకంఠ్ పాల్గొన్నారు.