Share News

10 MLAs Joining Congress: అనర్హత పిటిషన్లపై నేటి నుంచి వాదనలు!

ABN , Publish Date - Sep 29 , 2025 | 03:59 AM

తమ పార్టీ టికెట్‌పై గెలిచి కాంగ్రె్‌సలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై..

10 MLAs Joining Congress: అనర్హత పిటిషన్లపై నేటి నుంచి వాదనలు!

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ టికెట్‌పై గెలిచి కాంగ్రె్‌సలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై వ్యక్తిగత విచారణ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ చాంబర్‌లో ఆయన సమక్షంలో పిటిషన్‌దారులు, విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరఫు అడ్వొకేట్లు.. వాదనలు వినిపించనున్నారు. పది మంది ఎమ్మెల్యేల్లో వివరణ ఇచ్చిన 8 మంది కేసులను స్పీకర్‌ విచారించనున్నారు. సోమవారం ప్రకాశ్‌ గౌడ్‌, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌లపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి విచారణ జరగనుంది. అలాగే బుధవారం కూడా కొనసాగనుంది. మిగిలిన నలుగురు ఎమ్మెల్యేల విచారణ దసరా తర్వాత జరగనుంది. అయితే అనర్హత పిటిషన్లపై వాదనలు అక్టోబరు 6వ తేదీ వరకూ కొనసాగనుండడంతో అప్పటివరకు అసెంబ్లీ ఆవరణలో స్పీకర్‌ కార్యాలయం ఆంక్షలు విధించింది. సరైన అనుమతులు లేకుంటే విజిటర్లకు అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశం ఉండబోదని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు స్పష్టం చేశారు. అలాగే మీడియా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకూ ప్రవేశం లేదని పేర్కొన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 03:59 AM