Share News

kumaram bheem asifabad- రైతుకు వి‘పత్తి’

ABN , Publish Date - Sep 11 , 2025 | 10:45 PM

ఈ ఏడాది పత్తి పంట దిగుబడి వస్తుందని రైతు లు సంబరపడ్డారు. గత నెల కురిసిన భారీ వర్షాలకు పత్తికి తెగుళ్ల సోకడంతో పంట ఎదుగుదల నిలిచిపోయింది. పత్తి మొక్కను తెగుళ్లు, పురుగులు, తెల్ల, పచ్చ దోమ వెంటాడుతుండడంతో పూత, కాయలు రావడం లేదు. వాటిని నివారించేందుకు మందులు పిచికారి చేసినా ఫలితం ఉండడం లేదు. దీంతో అన్నదాతలు కలవరపాటుకు గరవుతున్నారు.

kumaram bheem asifabad- రైతుకు వి‘పత్తి’
ఎదుగుదల లేని పత్తి పంట

- కొన్ని చోట్ల ఏపుగా పెరిగినా కాత, పూత లేదు

- మరి కొన్ని చోట్ల నిలిచిన ఎదుగుదల

- ఎకరాకు రూ. 20 వేల పైనే ఖర్చు

- దిగుబడిపై అన్నదాతల దిగులు

ఈ ఏడాది పత్తి పంట దిగుబడి వస్తుందని రైతు లు సంబరపడ్డారు. గత నెల కురిసిన భారీ వర్షాలకు పత్తికి తెగుళ్ల సోకడంతో పంట ఎదుగుదల నిలిచిపోయింది. పత్తి మొక్కను తెగుళ్లు, పురుగులు, తెల్ల, పచ్చ దోమ వెంటాడుతుండడంతో పూత, కాయలు రావడం లేదు. వాటిని నివారించేందుకు మందులు పిచికారి చేసినా ఫలితం ఉండడం లేదు. దీంతో అన్నదాతలు కలవరపాటుకు గరవుతున్నారు.

చింతలమానేపల్లి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆరు గాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతులకు ఎప్పటికీ కష్టమే. వర్షాకాలం ప్రారంభంలో ఎంతో ఆశలతో పత్తి పంటకు రైతులు సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో మొదట్లో పత్తి పంటకు అనుకూలంగా వర్షాలు కురియడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల వర్షాలు భారీగా కురుస్తుండడంతో పత్తి పంట కొన్ని చోట్ల చూడడానికి చక్కగా, ఏపుగా కన్పిస్తున్నా పూత కాయ, లేక పోవడం, మరి కొన్ని చోట్ల పత్తి పంట ఎదగకపోవడంతో రైతన్నల్లో కలవ రం మొదలైంది. దీనికి తోడు అధిక వర్షాల కారణంగా తేమ శాతం అధికంగా మొక్కకు చేరడంతో తెగుళ్ల బెడద మొదలైంది. పత్తి మొక్కను తెగుళ్లు, పురుగులు, తెల్ల, పచ్చ దోమ వెంటాడుతుండడంతో పూత, కాయలు రావడం లేదు. దీంతో రైతులు పం టలు కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఈ ఏడాది 3.5 లక్షల ఎకరాల్లో పత్తి పంట ను సాగు చేశారు. నాలుగేళ్లుగా పత్తి సాగు చేసిన రైతులకు కొంత మేర మద్దతు ధర లభించింది. దీంతో ఈ ఏడాది కూడా రైతులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఎకరాకు సుమారు రూ. 20వేల పైనే ఖర్చు చేస్తున్నట్లు రైతులు చెబుతు న్నారు.

- పంట ప్రారంభంలో..

పత్తి పంట వేసిన ప్రారంభంలో వర్షాలు పత్తి పంటకు అనుకూలంగా కరిసినప్పటికీ ఇటీవల నిత్యం వర్షాలు కురవడంతో అధిక తేమ మొక్కల్లో చేరుకొని తెగుళ్ల బెడద మొదలైంది. పత్తి పంటకు మచ్చలు వచ్చి పురుగులు కాయలను నాశనం చేస్తున్నట్లు రైతులు పేర్కొంటు న్నారు. ప్రధానంగా జింక్‌ లోపం ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో తెగుళ్లను నివారించేందుకు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. మరి కొన్ని చేన్లల్లో సాగు చేసిన పత్తి పంట పచ్చగా, ఏపుగా కన్పించినప్పటికీ పూత, కాయ లేక పోవడంతో అన్నదాతల్లో కలవరం మొదలైంది. అధిక వర్షాలతో పాటు, ఇటీవల మహారాష్ట్రలోని ఓ ప్రాజెక్టు గేట్లు ఎత్తి వేతతో ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల మం డలాలైన చింతలమానేపల్లి, కౌటాల, బెజ్జూరు, పెంచిక లపేట, దహెగాం మండలాల సరిహద్దు భూముల్లో సాగు చేసిన పంటలు వందల ఎకరాల్లో నీట మునిగి పోవడంతో పెట్టుబడులు సైతం రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏటా గ్లైఫోసెట్‌ బీటీ -3 విత్తనాలు..

ఏటా గ్లైఫోసెట్‌ బీటీ -3 విత్తనాలను అధికంగా సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీంతో దళారులు పత్తి విత్తనాలు విత్తేటప్పడు రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలు అం టగడుతున్నారు. తెలంగాణ సరిహద్దు మండలాలైన పెంచికల పేట, చింతలమానేపల్లి, కౌటాల, బెజ్జూరు, దహెగాం వంటి మండలాల్లో ఏటా పోలీసులు నకిలీ విత్తనాలను పట్టుకుని కేసులు నమోదు చేసినప్పటికీ ఈ దందా ఆగడం లేదు. దీంతో కొన్ని చోట్ల పత్తి మొక్కల్లో పూత, కాత రావడం లేదని నిపుణులు చెబుతున్నారు.

మొక్క దెబ్బతిని..

అధిక వర్షాలకు మొక్క దెబ్బతినడంతో దిగుబడిపై రైతులు ఆశలు వదులు కోవల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాధారం కింద సాగు చేసే పత్తి పంట ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. కానీ వర్షాలకు చాలా వరకు పంట దెబ్బతినడంతో సగం కూడా రాని పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. పంటలకు ఎలాంటి తెగు ళ్లు ఉన్నా తమ సూచనల మేరకు మందులు పిచికారి చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కుర వడంతో మొక్కతో పాటు వేర్లల్లో నీటి శాతం అధిక మైంది. దీంతో మచ్చలు ఏర్పడే ఆస్కారం ఉంది. పురుగులు ఆకులను తొలచడం, ఎర్రబడడం, వివిధ తెగుళ్ల భారిన పడితే తమ సూచనల మేరకు మం దులు పిచికారి చేయాలని అధికారులు చెబుతున్నారు.

దిగుబడి తగ్గే ప్రమాదం..

- నందరాం, కోయపల్లి, రైతు

ఈ ఏడాది పత్తి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి పంట దెబ్బతిన్నది. అధిక వర్షాల కారణంగా పత్తి పంటకు తెగుళ్లు, చీడ పీడల బెడద మొదలైంది. కొన్ని చోట్ల పూర్తిగా పం ట పోయింది. అలాంటి వారికి పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

Updated Date - Sep 11 , 2025 | 10:45 PM