డిజిటల్ బోధనను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:18 PM
జీబీవీ విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఖాన్ అకాడమీ సహ కారంతో అందిస్తున్న డిజిటల్ పా ఠ్యాంశాల బోధనను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌కుమార్ కోరారు.
- నాగనూలు కేజీబీవీని తనిఖీ చేసిన డీఈవో రమేశ్
నాగర్‌కర్నూల్ టౌన్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : కేజీబీవీ విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఖాన్ అకాడమీ సహ కారంతో అందిస్తున్న డిజిటల్ పా ఠ్యాంశాల బోధనను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌కుమార్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రం పరిధిలోని నాగనూలు కే జీబీవీని డీఈవో ఆకస్మిక తనిఖీ చేశారు. కేజీబీ వీలో తరగతి గదులు, వంటగది, భోజనశాల ను పరిశీలించి విద్యార్థుల సమస్యలు అడిగి తె లుసుకున్నారు. అనంతరం తరగతి గదిలో వి ద్యార్థులకు అందిస్తున్న డిజిటల్ పాఠాల బోధ నను పరిశీలించారు. డీఈవో మాట్లాడుతూ వి ద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖాన్ అకాడమీ వెబ్ సైట్ ద్వారా గణితం, సైన్స్ సబ్జెక్టుల్లోని పాఠ్యాం శాలను డిజిటల్ విధానంలో బోధనను ప్రవే శపెట్టిందన్నారు. డిజిటల్ టెక్నాలజీతో అంది స్తున్న బోధనలో మెరుగైన ఫలితాలు వస్తా యని ఆయన అన్నారు. డీఈవో వెంట జిల్లా బాలికా విద్యాధికారి శోభారాణి పాల్గొన్నారు.