kumaram bheem asifabad- జనజీవనానికి ఇబ్బందులు రానీయం
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:17 PM
జిల్లాలో జనజీవనానికి ఇబ్బందులు రానీయకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం తుంపల్లి వాగును జిల్లా ఎస్పీ కాంతిలాల్ సుభాష్‌తో కలిసి బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జనజీవనానికి ఇబ్బందులు రానీయకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం తుంపల్లి వాగును జిల్లా ఎస్పీ కాంతిలాల్ సుభాష్‌తో కలిసి బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసరం యితేనే బయటకు రావాలని, వాగులు, నదులు దాటే ప్రయత్నం చేయకూడదని చెప్పారు. వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు భారీ వర్షాలు కురిసే సమయంలో చేనులలో, అడవులకు వెళ్లకకూడదని సూచించారు. జిల్లాలో గత రాత్రి కురిసన భారీ వర్షం కారణంగా వాగులు,ర ఒర్రెలు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రవహిస్తున్నాయని అన్నారు అధికారులు రక్షణ చర్యల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వంతెనలు, వాగులు, కాజ్‌వేల వద్ద బందో బస్తు ఏర్పాటు చేసి ప్రజలు అటువైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ రియాజ్ అలీ, సీఐ బాలాజీ వర ప్రసాద్ తదితరులు ఉన్నారు.
మురుగునీరు నిల్వకుండా చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని నివాస ప్రాంతాల్లో ఎక్కడ మురుగునీరు నిల్లకుండా చర్యలు చేపడుతామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుదవారం జిల్లాలోని ఆసిఫాబాద్ పటట్ణంలోని పైకాజీనగర్‌లోని మురుగు నీటి వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత రాత్రి కురిసిన వర్షానికి పట్ణంలోని మురుగు కాలువల్లో, ఖాళీ ప్రదేశాల్లో చేరిన మురుగు నీటిని మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాలనీలో శాశ్వత ముఉగు కాలువలను నిర్మించాలని కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబోయే మూడు రోజులలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పారిశుధ్య పనులు చేపట్టాలని, ప్రజలకు తాగునీటిని అందించాలని తెలిపారు. క్లోరినేషన్ పనులు, బ్లీచింగ్ పాగింగ్, అయిల్ బాల్స్ పిచుకారి సకాలంలో చేపట్టాలని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ గజానన్, తదితరులు ఉన్నారు.