వైభవంగా ధనుర్మాస పూజలు
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:23 PM
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కా లనీలో గల సీతారామచంద్రస్వామి దేవాల యం, హౌసింగ్ బోర్డులోని లక్ష్మీవేంకటేశ్వర స్వా మి దేవాలయంలో మంగళవారం ధనుర్మాసం సందర్భంగా గోదాదేవిఅమ్మవారి ప్రత్యేక పూజ లు వైభవంగా ప్రారంభమయ్యాయి.
కందనూలు, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కా లనీలో గల సీతారామచంద్రస్వామి దేవాల యం, హౌసింగ్ బోర్డులోని లక్ష్మీవేంకటేశ్వర స్వా మి దేవాలయంలో మంగళవారం ధనుర్మాసం సందర్భంగా గోదాదేవిఅమ్మవారి ప్రత్యేక పూజ లు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోవింద క్షేత్రంలో మంగళవారం తెల్లవారుజామున ఆల య ప్రధాన అర్చకుడు కే.శ్రీకాంత్, గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధను ర్మాస పూజలు ప్రారంభించారు. తిరుప్పావై పా శురం, సేవాకాలం, మహామంగళహారతి, ప్రత్యేక నైవేద్యాలు అమ్మవారికి నివేదన చేశారు. గోవిం ద క్షేత్ర ఆలయ అధ్యక్ష, కార్యదర్శులు సునేంద్ర కుమార్ నాగరాజు మాట్లాడుతూ భక్తులు అధి క సంఖ్యలో పాల్గొని గోదాదేవి అమ్మవారి కృప కు పాత్రులు కాగలరని కోరారు. రామాలయం లో ధనుర్మాస పూజలు ప్రత్యేకంగా కందాడై కృష్ణమాచార్యులు ప్రారంభించారు.రాగిశెట్టి పు ల్లయ్య, సుజాత దంపతులచే గోదాదేవి అమ్మ వారికి ప్రత్యేక ధనుర్మాస పూజలు రామాలయ ప్రధాన అర్చకుడు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో గోవింద క్షేత్ర ఆలయ కమిటీ సభ్యు లు చిగుళ్లపల్లి రమణకుమార్, బాలరాజు, కృష్ణ మాచారి, ప్రశాంత్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, రామ్మోహన్, పెద్దపులి సుధీర్‌బాబు, రామాలయ కమిటీ సభ్యులు అర్థం రవీందర్, మల్లేష్, గొల్ల రాము లు, శారద, మన్యపురెడ్డి, రమాదేవి, వెంకట్‌రెడ్డి, స్వామి, సాయి భక్తులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.