DGP Shivadhar Reddy: చట్టాన్నే కాదు.. దాని ఆత్మనూ అర్థం చేసుకోవాలి
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:19 AM
దేశంలో తెలంగాణ పోలీసు శాఖ ప్రథమ స్థానంలో ఉందని ఆ స్థాయిని నిలుపుకోవలసిన బాధ్యత ప్రొబేషనరీ డీఎస్పీలపై ఉందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు...
‘సేవతో గౌరవం పొందడం’.. ఇదే మన నినాదం
ప్రొబేషనరీ డీఎస్పీలతో డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): దేశంలో తెలంగాణ పోలీసు శాఖ ప్రథమ స్థానంలో ఉందని ఆ స్థాయిని నిలుపుకోవలసిన బాధ్యత ప్రొబేషనరీ డీఎస్పీలపై ఉందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పోలీసు శిక్షణా కేంద్రం (టీఎ్‌సపీఏ)లో 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలకు గురువారం శిక్షణ ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా హాజరైన డీజీపీ మాట్లాడుతూ... పోలీసు అధికారిగా కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాకుండా దాని ఆత్మను అర్థం చేసుకోవాలని సూచించారు. నిష్పాక్షికత, ఓర్పు, సానుభూతి వంటి విలువలే ఒక అధికారిని ఉత్తమంగా తీర్చిదిద్దుతాయన్నారు. ఈ బ్యాచ్‌లో 38 మంది మహిళా అధికారులు ఉండటం గర్వకారణమని, గౌరవం, సమానత్వం ఇక్కడి నుంచే ప్రారంభమవ్వాలని సూచించారు. ‘సేవతో గౌరవం పొందడం’ మన నినాదమని తెలిపారు. ఈ సందర్భంగా సిలబస్ కాపీలను డీజీపీ ఆవిష్కరించారు.