DGP Jitender: ప్రజా కేంద్రీకృత పోలీసింగ్‌కు ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:38 AM
విధి నిర్వహణలో పోలీస్ అధికారులు ప్రజా కేంద్రీకృత పోలీసింగ్(సిటిజెన్ సెంట్రిక్ పోలీసింగ్)కు ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ జితేందర్ అభిప్రాయపడ్డారు....
డీజీపీ జితేందర్
హైదరాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో పోలీస్ అధికారులు ప్రజా కేంద్రీకృత పోలీసింగ్(సిటిజెన్ సెంట్రిక్ పోలీసింగ్)కు ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ జితేందర్ అభిప్రాయపడ్డారు. పదవీ విరమణ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేన్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర డీజీపీగా 14 నెలలు పని చేసినందుకు గర్వపడుతున్నానన్నారు. తాను డీజీపీగా ఉన్న సమయంలోనే.. ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంలో తెలంగాణ పోలీస్ విభాగం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని చెప్పారు. డీజీపీ కార్యాలయ ఉద్యోగులు సమర్థంగా పనిచేస్తేనే రాష్ట్ర పోలీ్‌సకు మంచి గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. కాగా, అగ్నిమాపక శాఖ డీజీగా విక్రం సింగ్ మాన్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆ శాఖ డీజీగా కొనసాగిన వై. నాగిరెడ్డి నుంచి సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.