భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:13 PM
గూడెం శ్రీసత్యనారాయణ స్వామి దేవాలయంలో జరిగే కార్తీక పౌర్ణమి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం ఆలయాన్ని సందర్శించారు.
గూడెం ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
దండేపల్లి నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): గూడెం శ్రీసత్యనారాయణ స్వామి దేవాలయంలో జరిగే కార్తీక పౌర్ణమి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం ఆలయాన్ని సందర్శించారు. ముందుగా కలెక్టర్‌కు సన్నాయి వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అ నంతరం సత్యదేవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పౌర్ణ మి జాతరకు సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నం దున ఆలయ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీ సు బందోబస్తు, తాగనీరు, భారీకేడ్లు తదితర ప్రత్యేక ఏర్పాటు చేపట్టే విధంగా చూడాలన్నారు. ఇందుకు అధికారులు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం కలెక్టర్‌కు ఆలయ అధికారులు సత్కరించి స్వామి వారి ప్రసాదాలు అందజేశారు.
విద్యార్థులకు చక్కటి విద్యాబోధన అందించాలి
విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో చక్కటి విద్యాబోధన అందించే వి ధంగా ఉపాధ్యాయులు చూడాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. ద్వారక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మీకంగా తనిఖీ చేసి షెడ్యూల్ తెగల సంక్షేమ వసతి గృహా నిర్మాణ పనుల పరిశీలించి త్వ రగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పాఠశాలలో విద్యాబోధన తీరును పరిశీలించారు. అనం తరం పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణ, పరిసరాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, పౌష్టికాహారం శుద్ధ మైన తాగునీరు అందించాలన్నారు. ఆయన వెంట మండస్థాయి అధి కారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.