Medaram Temple Ahead of Maha Jatara: మేడారంలో భక్తుల సందడి
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:29 AM
మేడారం సమ్మక్క-సారలమ్మ దేవాలయానికి భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం సుమారు 10వేల మందికి పైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. జనవరి....
తాడ్వాయి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మేడారం సమ్మక్క-సారలమ్మ దేవాలయానికి భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం సుమారు 10వేల మందికి పైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. జనవరి చివరి వారంలో మహాజాతర జరగనుండగా.. ముందస్తుగానే వచ్చి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.ఆలయ విస్తరణకు ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో భాగంగా.. సమ్మక్క- సారలమ్మల గద్దెలను దర్శించుకొని అదే క్రమంలో పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను భక్తులు దర్శించుకునేలా అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఈ నూతన గద్దెలపై దేవతలను గురువారం పునః ప్రతిష్ఠించనున్నారు.