Share News

రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:58 PM

యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో సుమారు రూ.1500 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఈ నెల 6న సీఎం రేవంత్‌రెడ్డి మండలంలోని తిర్మలాపూర్‌లో శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య తెలిపారు.

రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు
అధికారులతో కలిసి సీఎం సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న విప్‌ అయిలయ్య

6వ తేదీన తిర్మలాపూర్‌లో సీఎం శంకుస్థాపన : విప్‌ అయిలయ్య

తుర్కపల్లి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో సుమారు రూ.1500 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఈ నెల 6న సీఎం రేవంత్‌రెడ్డి మండలంలోని తిర్మలాపూర్‌లో శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య తెలిపారు. తుర్కపల్లి మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామంలో ఈ నెల 6న మండలంలోని తిర్మలాపూర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం సాయంత్రం ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య కలెక్టర్‌ హనమంతరావు, వివిధ జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతి నియోజకవర్గంలో పర్యటించి ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి అభివృద్దిపై సీఎం ప్రత్యేక దృష్టి సారిం చారని, దేశం, రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులకు అన్ని మౌళిక వసతులు కల్పించేందుకు రూ. 100కోట్లను మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారన్నారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలు 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న గందమల్ల చెరువును రూ.700 కోట్లతో రిజర్వాయర్‌ చేసేందుకుగాను సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ రిజర్వాయర్‌ ద్వారా 15 మండలాల్లో సుమారు వంద ఎకరాలకు గ్రావిటి ద్వారా గోదావరి జలాలతో సాగు నీటి తీరుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అధిక సంఖ్యలో ఉన్నందున రూ.200 కోట్లతో ఇంటిగ్రేటేడ్‌ స్కూల్‌కు శంకుస్థాపన చేస్తారని, ఈ ప్రాంతంలో పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందనుందన్నారు. అదే విధంగా యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో రూ. 183కోట్లతో నిర్మించే మెడి కల్‌ కళాశాల, రూ.45 కోట్లతో వేద పాఠశాల, మోటకొండూర్‌ మండలంలో నిర్మించే ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు అభవృద్ది పనులకు సీఎం శంఖుస్థాపన చేస్తారన్నారు. 100 ఎకరాల్లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, అదనపు కలెక్టర్‌ లోకల్‌ బాడీస్‌ భాస్కర్‌రావు, మదర్‌ డెయిరీ చైర్మన్‌ మధుసూధన్‌రెడ్డి, ఆలేరు మార్కెట్‌ చైర్మన్‌ అయినాల చైతన్యమహేందర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 11:58 PM