kumaram bheem asifabad- అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:12 PM
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు సమర్థవంతంగా, త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి శుక్రవారం జూమ్ మీటింగ్ ద్వారా ఎంపీడీవోలు, ఎంపీవోలు, కార్యదర్శులు, ఏపీవోలు, ఏపీఎంలు, హౌసింగ్, ఇంజనీరింగ్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు సమర్థవంతంగా, త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి శుక్రవారం జూమ్ మీటింగ్ ద్వారా ఎంపీడీవోలు, ఎంపీవోలు, కార్యదర్శులు, ఏపీవోలు, ఏపీఎంలు, హౌసింగ్, ఇంజనీరింగ్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, వన మహోత్సవం, ఎన్నికల నిర్వహణ, పారిశుధ్యం, సీజనల్ వ్యాధుల నియంత్రణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, నిరుపేదలకు ఆర్థిక సహాయం, విద్యా సంస్థలు, వైద్య సిబ్బంది క్యాంపుల నిర్వహణ అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న సంక్షేమ అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీపీవో భిక్షపతి, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. దివ్యాంగుల కోసం ఉచిత కృత్రిమ అవయవాలు, సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పారు. ఈ శిబిరం ద్వారా దివ్యాంగులకు చేయూత అందించడం సంతోషంగా ఉందని, సమగ్ర శిక్షణ తెలంగాణ, అలింకో సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
14ఏఎస్‌ఎఫ్29:
గ్రంథాలయాల అభివృద్ధిపై దృష్టి సారించాలి
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో ఆయన చాంబర్‌లో గ్రంథాలయ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రంథాలయాలకు వచ్చే పాఠకులకు దినపత్రికలు, చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాలో కౌటాల, రెబ్బెన, కెరమెరి మండల కేంద్రాల్లో ఉన్న భవనాలు శిథిలావస్థలో ఉన్నందున ఇతర భవనాలలోకి మార్చాలని, తిర్యాణిలో నూతన గ్రంథాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సరిత, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.