Share News

kumaram bheem asifabad- అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:45 PM

జిల్లాలో కొసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో బుధవారం పంచాయతీ రాజ్‌, రహదారుల, భవనాల శాఖ, ఈడబ్ల్యూఐడీసీ, గిరిజన సంక్షేమ శాఖ, ఇంజనీరింగ్‌ అఽధికారులు, ఇతర అన్ని విభాగాల అధికారులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహఙంచారు

kumaram bheem asifabad- అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో బుధవారం పంచాయతీ రాజ్‌, రహదారుల, భవనాల శాఖ, ఈడబ్ల్యూఐడీసీ, గిరిజన సంక్షేమ శాఖ, ఇంజనీరింగ్‌ అఽధికారులు, ఇతర అన్ని విభాగాల అధికారులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహఙంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన రహదారులు, వంతెనలు, కల్వర్టులు, పాఠశాల భవనాలు, అదనపు గదులు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల భవనాలు, ప్రధానమంత్రి జన్‌మన్‌, జుగా పథకాల కింద చేపట్టి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. వివిధ గ్రాంట్ల కింద మంజూరైన అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ, సమగ్ర శిక్ష అభియాన్‌ కింద మంజూరైన పాఠశాల భవనాలు, అదనపు గదుల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు ఉపయోగపడేలా వినియోగంలోకి తీసుకు రావాలని తెలిపారు. ప్రధాన మంత్రి జన్‌ మన్‌, జుగా పథకాల కింద ఆదివాసీ గిరిజనుల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారుల నిర్మాణం, సామాజిక భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, ఉప కేంద్రాల నిర్మాణాల్లో పూర్తి నాణ్యత పాటించాలని చెప్పారు. పనుల నిర్వహణలో ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, 15వ ఆర్థిక ప్రాణాళిక కింద మంజూరైన నిధులను ఎంపిక చేసిన పనులకు మాత్రమే వినియోగించా లన్నారు. ఉపాధి హామీ పథకంలో లేబర్‌ కాంపోనెంట్‌ను ఉప యోగించుకోవాలని అన్నారు. ఆకాంక్షిత తిర్యాణి బ్లాక్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి దత్తారావు, జిల్లా పరిషత్‌ సీఈవో లక్ష్మీనారాయణ, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 11:45 PM