Share News

kumaram bheem asifabad- అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Nov 12 , 2025 | 10:47 PM

ప్రభుత్వ పరంగా మారుమూల గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌ అన్నారు. మండలంలోని ఆశపెల్లి (రామునాయక్‌ తండా) గ్రామాన్ని చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌ బుధవారం సంద ర్శించారు.

kumaram bheem asifabad- అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న నాయకులు

జైనూర్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పరంగా మారుమూల గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌ అన్నారు. మండలంలోని ఆశపెల్లి (రామునాయక్‌ తండా) గ్రామాన్ని చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌ బుధవారం సంద ర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యల్ని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కింద నిర్మించిన మురుగుకాలువలు, సిమెంట్‌ రోడ్లను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. పనులు త్వరగా పూర్తి చేసుకుంటే ప్రభుత్వం డబ్బులు అకౌంట్లలో వేస్తుం దన్నారు. అంతకు ముందు అనారోగ్యంతో బాధ పడుతున్న మాజీ ఎంపీటీసీ రాథోడ్‌ రమేశ్‌ను చైర్మన్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్‌, పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్‌ ముకీద్‌, వైస్‌ ఎంపీపీ పెందుర్‌ ప్రకాష్‌, మాజీ సర్పంచులు రాథోడ్‌ సవితబాయి, జాదవ్‌ ధురిబాయి, నాయకులు మేస్రాం అంబాజీరావ్‌, రాథోడ్‌ రాందాస్‌, జాదవ్‌ ధరంసింగ్‌, సుద్దాల శ్రీనివాస్‌, ఫీల్డ్‌ ఆసిస్టేంట్‌ జల్పతరావ్‌, కాంబ్లే ధమ్మపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 10:47 PM