మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:11 PM
జిల్లాలోని మున్సి పాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలె క్టర్ కుమార్‌దీపక్ తెలిపారు. ఆదివారం కలెక్టర్ చాంబర్‌లో మందమర్రి, క్యాత నపల్లి, చెన్నూరు మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని మున్సి పాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలె క్టర్ కుమార్‌దీపక్ తెలిపారు. ఆదివారం కలెక్టర్ చాంబర్‌లో మందమర్రి, క్యాత నపల్లి, చెన్నూరు మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాల న్నారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువలను శుభ్రం చేయాలన్నారు. మున్సిపల్ పరిధిలో పన్నులను వంద శాతం వసూలు చేసేలా చర్యలు చేప ట్టాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూడాలన్నారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా చేపట్టిన నీటి ట్యాంకులు, ఇతర పనులను వేగవం తంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి, క్యాతనపల్లి ము న్సిపల్ కమీషనర్‌లు రాయలింగు, రాజు, అధికారులు పాల్గొన్నారు.