Share News

త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి

ABN , Publish Date - Jun 13 , 2025 | 11:30 PM

మంచిర్యాల పట్టణంలో చేప ట్టిన అభివృద్ధి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శుక్రవారం విశ్వ నాథ ఆలయ ప్రాంగణంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూల్చివేత పనులను ఆయన పరిశీలించారు.

త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి
షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూల్చివేత పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

మంచిర్యాలక్రైం, జూన్‌13 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల పట్టణంలో చేప ట్టిన అభివృద్ధి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శుక్రవారం విశ్వ నాథ ఆలయ ప్రాంగణంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూల్చివేత పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో ఆగమ శాస్త్ర పండితుల సలహాలతో ఆలయం అభివృద్ధి చేస్తానని అన్నా రు. మార్కెట్‌రోడ్డులో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని పూర్తి చేసి నగరాన్ని సుందరీ కరణంగా తీర్చిదిద్దుతానన్నారు. లక్ష్మీ టాకీస్‌ నుంచి రంగపేట వ రకు వెళ్లే ఫోర్‌లైన్‌ రోడ్డు నిర్మాణ పనులకు మాతాశిశు ఆసుపత్రి పనులు ఇది వరకు చేపట్టామన్నారు. ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. నాయ కులు పట్టణ అధ్యక్షులు పూదరి నరేశ్‌, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 11:30 PM