Share News

పాఠశాలల్ల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:35 PM

విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా హాస్టళ్లలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగం గా పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

పాఠశాలల్ల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

నెన్నెల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా హాస్టళ్లలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగం గా పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం మం డల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పాఠశాలను సం దర్శించారు. అదనపు గదుల భవనం నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు సలక సౌకర్యాలతో నాన్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. స్కూళ్లలో తాగునీరు, విద్యుత్‌ సౌక ర్యం, మూత్రశాలలు, వంటశాల, ప్రహరీ గోడలతో పాటు ఇతర మౌళిక స దుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. విధ్యార్థుల సంఖ్య, స్టాఫ్‌ వివ రాలను ఎస్‌వో కవితను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌ పరిసరాలను పరి శీలించారు. వంటశాలలో వంట చేసే విధానం, శుభ్రత, కూరగాయల నా ణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారం, శుద్ధమైన తాగునీరు అందించాలన్నారు. అనంతరం చిత్తా పూర్‌ గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యాబో ధన చేయాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తర గతులు నిర్వహించాలన్నారు. ఆయన వెంట మండల అధికారులు ఉన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 11:35 PM