Share News

kumaram bheem asifabad- డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి

ABN , Publish Date - Aug 06 , 2025 | 11:28 PM

డబుల్‌ ఇంజన్‌ సర్కారుతోనే తెలంగాణ రాష్ట్రం అభివ్ధృ చెందుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి బుధవారం అయన రావడంతో బీజేపీ శ్రేణులు అయనకు ఘనస్వాగతం పలికాయి. పట్టణంలో బైక్‌ర్యాలీ చేపట్టారు

kumaram bheem asifabad- డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి
మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): డబుల్‌ ఇంజన్‌ సర్కారుతోనే తెలంగాణ రాష్ట్రం అభివ్ధృ చెందుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి బుధవారం అయన రావడంతో బీజేపీ శ్రేణులు అయనకు ఘనస్వాగతం పలికాయి. పట్టణంలో బైక్‌ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌, కుమరంభీం విగ్రహలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలకు 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని పదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందన్నాఉ. పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టి భారత్‌ను ప్రపంచంలోనే ఆగ్రస్థానంలో నిలిపారన్నారు. 11ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు 12 జాతీయ రహదారులు మంజూరయ్యాయని చెప్పారు. దీంతో ప్రజలకు ఎంతో సౌకర్యం కలిగిందన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు రూ. 12 లక్షల కోట్ల నిధులు వెచ్చించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తామే అన్ని ఇస్తున్నామని చెప్పుకుంటుందని తెలిపారు. దేశ సంపదను పెంచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపభూయిష్టంగా ఉందని తెలిపారు. ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించకుండా ఇక్కడి ప్రాంత సాగు భూములకు అన్యాయం చేశారన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలలోని 2.50 లక్షల ఎకరాలు సాగునీరందే అవకాశం ఉండేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం కోసం డీపీఆర్‌ ఇస్తే కేంద్రంతో మాట్లాడతామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపుని చ్చారు. ఎంపి నగేష్‌ మాట్లాడుతూ జీవో 49తో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. 2014లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హహాంలోనే కన్జర్వేషన్‌ ఫారెస్టుకు బీజం పడిందన్నారు. జీవో తీసుకు వచ్చింది, నిలుపుదల చేసింది కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరు హంతకులే సంతాపసభలు పెట్టినట్లు ఉందన్నారు. జీవో విడుదల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లె ప్రయత్నం చేస్తుందని చెప్పారు. జిల్లాకు చెందిన రూ. 80 కోట్ల నిధులను ఇతర జిల్లాలకు తరలించిన ఘనత కాంగ్రెస్‌దేనని విమర్శించారు. నిధులు వెనక్కు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే హరీష్‌బాబు మాట్లాడుతూ జీవో 49 రద్దయ్యే వరకు ఉద్యమిస్తామన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఆర్‌ఆండ్‌బీ, ఐటీడీఏలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదన్నారు. మున్సిపాలిటీ కార్మికులకు వేతనాలు ఇవ్వని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. రాష్ట్రం దివాలా తీసిందన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం అవినీతిపై ఎండగడతామని తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, మాజీ ఎంపీ వెంకటేష్‌నేత, వన్‌నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ కన్వీనర్‌ అరిగెల నాగేశ్వర్‌రావు, మాజీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌, బీజేపీ నాయకులు కొట్నాక విజయ్‌, చెర్ల మురళీ, గోమాస శ్రీనివాస్‌, కొంగ సత్యనారయణ, మల్లిఖార్జున్‌ యాదవ్‌, ఏమాజీ, అంజనేయులుగౌడ్‌, సొల్లు లక్ష్మి, కృష్ణకుమారి పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 11:28 PM