Share News

Deputy Chief Minister Bhatti Vikramarka: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:12 AM

కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన పీసీసీ అధ్యక్షుడు...

Deputy Chief Minister Bhatti Vikramarka: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

  • గత పాలకులు పట్టించుకోలేదు: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్ర జ్యోతి): కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి యూసు్‌ఫగూడలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ కార్యాలయానికి చేరుకున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసు్‌ఫగూడ, మధురానగర్‌లో పర్యటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గత పాలకుల హయాంలో పేదల బస్తీల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రచారంలో షబ్బీర్‌ అలీ, వైరా ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 04:12 AM