Share News

కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:48 PM

గ్రామాల అభి వృద్ధి కాంగ్రెస్‌ పార్టీతోనే జరు గుతుందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయ కుడు చిలుక వివేక్‌ రెడ్డిఅన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి
ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాయకుడు తిరుపతిరెడ్డి

- సీనియర్‌ నాయకుడు చిలుక వివేక్‌రెడ్డి

తిమ్మాజిపేట, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల అభి వృద్ధి కాంగ్రెస్‌ పార్టీతోనే జరు గుతుందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయ కుడు చిలుక వివేక్‌ రెడ్డిఅన్నారు. తిమ్మాజిపేట మం డల పరిధిలోని అమ్మపల్లి గ్రా మానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు గంగుల తిరుపతిరెడ్డి తన అనుచరులతో ఆదివారం నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు తిమ్మాజి పేటకు చెందిన యువ నాయకులు దాచేపల్లి రాము కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకా లకు ఆకర్షితులమై కాంగ్రెస్‌ పార్టీలో చేరామ న్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను బలప రుస్తూ సర్పంచ్‌లుగా గెలిపించా లన్నారు. చిలు క భాస్కర్‌రెడ్డి, చిలుక ఎల్లారెడ్డి, అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరికలు : కందనూలు, (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు అవుట కుమా ర్‌, ఆయన అనుచరులు బీఆర్‌ఎస్‌ను వీడి ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 11:48 PM