Share News

kumaram bheem asifabad- పీఎం జుగా పథకంతో గిరిజన ఆవాసాల అభివృద్ధి

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:30 PM

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన ప్రధాన మంత్రి జన జాతీయ గ్రామీణ ఉత్కర్స్‌ అభియాన్‌ పథకంతో గిరిజనుల ఆవాసాలు అభివృద్ధి చెందుతాయని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రమాదేవి అన్నారు. ఆసిఫాబాద్‌ మండలం దడ్బాపూర్‌లో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు

kumaram bheem asifabad- పీఎం జుగా పథకంతో గిరిజన ఆవాసాల అభివృద్ధి
మాట్లాడుతున్న గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన ప్రధాన మంత్రి జన జాతీయ గ్రామీణ ఉత్కర్స్‌ అభియాన్‌ పథకంతో గిరిజనుల ఆవాసాలు అభివృద్ధి చెందుతాయని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రమాదేవి అన్నారు. ఆసిఫాబాద్‌ మండలం దడ్బాపూర్‌లో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జిల్లాలో 102 గిరిజన గ్రామాలను ఎంపికయ్యాయని అన్నారు. ఈ పథకం ద్వారా ఆయా గ్రామాల రూపు రేఖలు మారుతాయని తెలిపారు. ఆధార్‌కార్డు, ఆయుష్మాన్‌, ఆరోగ్య శ్రీ కార్డు, కుల ధృవీకరణ పత్రం, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు, విద్యుత్‌, విద్య, తదితర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్‌, ఎస్‌సీఆర్పీ రవీందర్‌, ఎస్బీఐ మేనేజర్‌ అనంత్‌ తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని కరంజీవాడ గ్రామంలో బుధవారం పీఎంపథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పథకంలో గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ముఖ్య ఉద్దేశమని ఈ పథకం కింద కరంజీవడ ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. కార్యక్రమంలో ఏటీడీవో శ్రీనివాస్‌, ఎస్‌సీఆర్పీ నరేష్‌, కార్యదర్శి వెంకటేశ్వర్‌, డీటీ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి జంజాతి ఉన్నత్‌ గ్రామ్‌ అభియా న్‌(పీఎం జుగా) పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బాబాపూర్‌, కోయపల్లి గ్రామాల్లో పీఎం జుగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

తిర్యాణి,(ఆంధ్రజ్యోతి): మండలంలోని గంభీరావుపేట, ఏదులపాడు గ్రామంలో పీఎం జగా పథకంపై ఎంపీడీవో మల్లేష్‌ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పథకంలో గిరిజన గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించడం ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఎస్‌ఆర్పీ యశ్వంత్‌రావు, వెటర్నరీ డాక్టర్‌ సాగర్‌, సీఎఫ్‌ఎల్‌ కార్యకర్త శ్రీకాంత్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలోని జండగాగూడలో ఎస్సీఈఅర్పీ చవ్హాన్‌ రవిందర్‌ పీఎం జుగా పథకంపై గిరిజనులకు ఆవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కుంర తిరుమల, మాజీ సర్పంచ్‌ పూసం రాము పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:30 PM