మోదీ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్థి
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:53 PM
ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్థి చేస్తున్నారని, మోదీ అమలు చేస్తున్న జీఎస్టీ సంస్కరణల వల్ల పేద, మధ్యతరగతి ప్ర జలకు ఆర్థిక లబ్ది చేకూరుతుందని బీజేపీ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి పేర్కొన్నా రు.
జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఆర్థిక లబ్ది
చెన్నూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్థి చేస్తున్నారని, మోదీ అమలు చేస్తున్న జీఎస్టీ సంస్కరణల వల్ల పేద, మధ్యతరగతి ప్ర జలకు ఆర్థిక లబ్ది చేకూరుతుందని బీజేపీ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి పేర్కొన్నా రు. గురువారం చెన్నూరు పట్టణంలోని గాంధీ చౌక్‌లోని కిరాణం, మెడికల్, చెప్పుల దుకాణా లకు వెళ్లి జీఎస్టీ ధరల అమలుపై దుకాణదారు లను అడిగి తెలుసుకున్నారు. జీఎస్టీ తగ్గింపుధ రలను ప్రజలకు అందించాలని దుకాణాల యా జమానులకు సూచించారు. అనంతరం చెన్నూ రులోని మార్వాడీ భవన్‌లో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన అభినందన సభలో రఘునాధ్ వెరబెల్లి పాల్గొన్నారు. ఆయనను నాయకులు పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా రఘునాధ్ వెరబెల్లి మాట్లాడుతూ జిల్లా కార్యక ర్తల కృషి వల్లనే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవీ తనకు దక్కిందన్నారు. ప్రజలందరు బీజేపీకి రాష్ట్రంలో అధికారం ఇవ్వడానికి సిద్దంగా ఉంద న్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపే తం కృషి చేయాలన్నారు. 2028 అసెంబ్లీ ఎన్ని కల్లో గెలిచేది బీజేపీయేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, ఈ విషయాన్ని నాయకు లు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నాయకులు దుర్గం అశోక్, వం గపల్లి వెంకటేశ్వర్‌రావు, రాపర్తి వెంకటేశ్వర్లు, బ త్తుల సమ్మయ్య, లక్ష్మీనారాయణరెడ్డి, ముకేష్ గౌడ్, కమలాకర్‌రావు, శ్రీపాల్, వెంకటనర్స య్య, శ్రీనివాస్,చారి, శివకృష్ణ, రామయ్య, నాగే శ్వర్‌రావు, పున్నంచంద్, రాజశేఖర్ గౌడ్, శంకర్, శంకర్ పాల్గొన్నారు.