మాన్యం ఉన్నా ఆదరణ కరువు
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:51 AM
శాలిగౌరారం మండలం నూలగడ్డ కొత్తపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం నిరాదరణకు గురైంది. పదేళ్ల నుంచి ఈ ఆలయంలో ధూప దీప నైవేద్యాలు లేక ఆలయానికి భక్తులు రాకపోవడంతో లేక వెలవెలబోతుంది.
మాన్యం ఉన్నా ఆదరణ కరువు
పూజలు నోచుకోని ఆంజనేయస్వామి
ఐదేళ్లుగా ఎన.కొత్తపల్లి ఆలయానికి తాళం
అన్యాక్రాంతమవుతున్న దేవాలయ భూములు
పట్టించుకోని అధికారులు
శాలిగౌరారం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): శాలిగౌరారం మండలం నూలగడ్డ కొత్తపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం నిరాదరణకు గురైంది. పదేళ్ల నుంచి ఈ ఆలయంలో ధూప దీప నైవేద్యాలు లేక ఆలయానికి భక్తులు రాకపోవడంతో లేక వెలవెలబోతుంది. ఈ దే వాలయ పరిధిలో 12 ఎకరాల భూమి ఉ న్నా నిరుపయోగంగా ఉండటంతో అన్యాక్రాంతమవుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కొందరు ఈ ఆలయ ప్రాంగణంలో దైవ పూజలు కాకుండా ఇతర పూజలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఐదేళ్లుగా గుడికి తాళం.....
నూలగడ్డ కొత్తపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో 5 ఏళ్ల నుంచి ని త్య పూజలు నిలిపి వేశారు. గతంలో దేవుని పేరు మీద ఉన్న భూ మిని సాగుచేసుకుంటూ గ్రామంలో ఉన్న పూజారులు నిత్య పూజలు చేసే వారు. ఐదేళ్లు నుంచి గ్రామంలోని పూజారులు పూజలు చేయడం నిలిపివేశారు. దేవాలయ భూములను కూడా సాగు చేయడం లేదు. అప్పటినుంచి గుడికి తాళం వేసే ఉంటుంది. ఆలయంలో నిత్య పూజలు నిర్వహించాలని ఎండోమెంట్ అధికారుల దృష్టికి తీసుకె ళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పండుగలు, ఉత్సవాలు జరిగినపుడు కూడా ఆలయం మూసే ఉంటుంది.
నిత్యం పూజలు జరిపించాలి
గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం పూర్తి గా నిరాదరణకు గురైయింది. గతంలో ధూపదీప నైవేద్యాలతో భక్తుల సందడిగా ఉన్న ఈ ఆలయం గ్రామ పూజారులు, ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ని త్య పూజలు చేయడం లేదు. ఐదేళ్లుగా ఆలయానికి తాళం వేసి ఉండటం వల్ల భక్తులు పూజలకు దూరంగా ఉంటున్నారు. ఆలయం మూ సి ఉన్నందున గ్రామంలో అరిష్టాలు జరుగుతున్నాయి. వెంటనే ఎండోమెంట్ అధికారులు దేవాలయ భూములను దేవస్థానం పేరున మార్చి, ఆలయంలో ధూపదీప నైవేద్యాలతో పాటు నిత్యపూజలు చయడానికి పూజారులను నియమించాలి.
- సిరిపంగి రాములు, మాజీ సర్పంచ, నూలగడ్డ కొత్తపల్లి