5 కల్లా కాళేశ్వరం బ్యారేజీల..డిజైన్ కన్సల్టెంట్ ఎంపిక: ఉత్తమ్
ABN , Publish Date - Nov 23 , 2025 | 07:22 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ కోసం డిజైన్ కన్సల్టెంట్ ఎంపిక ప్రక్రియను...
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ కోసం డిజైన్ కన్సల్టెంట్ ఎంపిక ప్రక్రియను డిసెంబరు 5 కల్లా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి కె ప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రాబోయే 6 నెలల నుంచి 36 నెలల కాలంలో కొత్తగా ఆయకట్టును అందుబాటులోకి తెచ్చే ప్రాజెక్టుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఇక నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతి కోసం తగిన చర్యలు చేపట్టాలన్నారు.