Deputy CM Bhatti Vikramarka: అపర్ణకు తక్షణమే వైద్య సేవలందించండి
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:24 AM
నా కూతురి ప్రాణాలు కాపాడండి అన్న శీర్షికన సోమవారం ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి డిప్యూటీ సీఎం...
నిమ్స్ డైరెక్టర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
బోనకల్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ‘నా కూతురి ప్రాణాలు కాపాడండి’ అన్న శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ప్రత్యేకమైన కేసుగా పరిగణించి అపర్ణకు తక్షణమే వైద్య సేవలందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మాణపల్లి గ్రామానికి చెందిన పేద విద్యార్థిని తాటికొండ అపర్ణ లివర్ దెబ్బతినడంతో ఇటీవల నిమ్స్‌లో వైద్య సేవలు పొందింది. అయితే ఆరోగ్యశ్రీ పరిమితి దాటింది. ఈ నేపథ్యంలో ఆమెకు తిరిగి ఆస్పత్రిలో వైద్య సేవలందించే విషయమై భట్టి విక్రమార్క సోమవారం నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో మాట్లాడారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అపర్ణను ప్రత్యేకమైన కేసుగా పరిగణించి వైద్య సేవలందించాలని ఆదేశించారు. అపర్ణకు తిరిగి వైద్య సేవలందిచేలా కృషి చేసిన ‘ఆంధ్రజ్యోతి’కి ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.