Overseas Scholarships: విదేశీ విద్యకు భరోసా
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:48 AM
పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలు రూ.303 కోట్లను వెంటనే విడుదల చేయాలని...
రూ.303 కోట్ల ఓవర్సీస్ స్కాలర్‌షి్‌పలను విడుదల చేయండి
ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలు రూ.303 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షి్‌పల మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలని సూచించారు. ఆర్థిక స్తోమత లేక, ఉన్నత చదువులు చదవాలన్న ఆలోచనతో చాలామంది పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఓవర్సీస్ స్కాలర్‌షి్‌పలతో విదేశాలకు వెళ్లారు. కొంత కాలంగా వారికి అవి అందడం లేదు. మరోవైపు అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో విధిస్తున్న రకరకాల ఆంక్షలతో ఆ విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతోంది. గతం లో మాదిరిగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేదు. మరోవైపు బ్యాంకుల్లో తీసుకున్న విద్యా రుణాల భారం పెరుగుతోంది. ఈ పరిస్థితులను అవగాహన చేసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్‌షి్‌పల మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలంటూ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారని డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.