Deputy CM Bhatti Orders Report on GST Rationalization: జీఎ్‌సటీ హేతుబద్ధీకరణ నష్టంపై నివేదిక ఇవ్వండి
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:19 AM
వస్తు, సేవల పన్ను జీఎ్‌సటీ రేట్ల హేతుబద్ధీకరణతో రాష్ట్రానికి వాటిల్లే ఆదాయ నష్టంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం..
వాణిజ్య పన్నులపై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) రేట్ల హేతుబద్ధీకరణతో రాష్ట్రానికి వాటిల్లే ఆదాయ నష్టంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. వాణిజ్య పన్నుల శాఖ పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. జీఎ్‌సటీ నూతన పన్నురేట్లు ఈ నెల 22 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయని, దీని ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉంటుందనేది క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడే ప్రమాదం ఉందన్నారు. పన్ను ఎగవేతదారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.