Deputy CM Bhatti Orders: గురుకులాల బకాయిలు విడుదల చేయండి
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:53 AM
ఎస్సీ, మైనారిటీ గురుకులాల డైట్, అద్దె బకాయిలు, మధ్యాహ్న భోజన బకాయిలు మొత్తం రూ.162.89 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క...
ఆర్థిక శాఖకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, మైనారిటీ గురుకులాల డైట్, అద్దె బకాయిలు, మధ్యాహ్న భోజన బకాయిలు మొత్తం రూ.162.89 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ప్రజాభవన్‌లో ఆర్థిక శాఖ అధికారులు, గురుకుల సంస్థల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ గురుకులాలు, హాస్టళ్లు, ఇతర సంస్థలకు సంబంధించిన డైట్, అద్దె, కాస్మెటిక్స్ బకాయిలు రూ.51.36 కోట్లు, మైనారిటీ గురుకులాలు, మైనారిటీ విద్యా సంస్థల డైట్, అద్దె బకాయిలు రూ.47.61 కోట్లను వెంటనే విడుదల చేయాలని చెప్పారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.63.92 కోట్లను కూడా విడుదల చేయాలని ఆదేశించారు. ఆహార నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని పేర్కొన్నారు.