Share News

డెంగీ డేంజర్‌ బెల్స్‌

ABN , Publish Date - May 15 , 2025 | 10:49 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో డెంగీ వ్యాధి దడ పుట్టిస్తోంది.

డెంగీ డేంజర్‌ బెల్స్‌
పద్మావతీ కాలనీలోని ఓ ఇంటి వద్ద శుభ్రం చేయని మురుగునీటి కాలువ

- మహబూబ్‌నగర్‌ పట్టణంలోనే అత్యధికంగా కేసులు

- జిల్లాలో 5 నెలల్లో 35 పాజిటివ్‌ కేసులు

- ప్లేట్‌లెట్స్‌ తగ్గితే ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు

- సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులు

- జనరల్‌ ఆసుపత్రిలో మూలన పడ్డ ఎస్‌డీపీ యంత్రం

- నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) మే 15 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ జిల్లాలో డెంగీ వ్యాధి దడ పుట్టిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 35 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణం, కాలంతో పనిలేకుండా దోమల వలన ఈ వ్యాధి వ్యాపిస్తోంది. గ్రామీణ ప్రాం తాలలో కాకుండా, మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఈ వ్యాధి ఎక్కువ మందికి సోకుతోంది. వ్యాధి సోకి తెల్లరక్తకణాలు తగ్గిపోయి ప్లేట్‌లేట్స్‌ ఎక్కించాలంటే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. జనరల్‌ ఆసుపత్రిలో ఆ సౌకర్యం ఉన్నప్పటికీ ఎస్‌డీపీ యం త్రం పనిచేయడం లేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. శుక్ర వారం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

పట్టణ ప్రాంతాల్లోనే అధికం

జిల్లాలో డెంగీ వ్యాధి ప్రమాదకరంగా వ్యాపిస్తోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే పాజటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 35 డెంగీ కేసులు నమోదయ్యాయి. అందులో 21 కేసులు పాలమూరు పట్టణ ప్రాంతంలో నమోదుకాగా, 14 కేసులను మండలాల్లో గుర్తించారు. గ్రామాల్లో అక్కడ క్కడ మాత్రమే కేసులు వస్తున్నాయి. కానీ జిల్లాకేం ద్రంలోని మురికివాడల్లో ఈ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అందులో రామయ్యబౌలి, శ్రీనివా సకాలనీ, పద్మావతి కాలనీ, దొడ్డలోనిపల్లి, టీడీ గుట్ట, క్రిస్టియన్‌పల్లి, మర్లు, మోతీనగర్‌, కుమ్మరివాడి, పాత పాలమూరు, ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

గత ఏడాదితో పోలిస్తే...

గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ 31 వరకు జిల్లావ్యాప్తంగా 481 డెంగీ పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 5 నెలల్లో 35 కేసులు నమోదు కాగా, గత ఏడాది తొలి ఐదు నెలల్లో 48 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన గత ఏడాదితో పోలిస్తే కొంత వరకు కేసులు తగ్గాయి. అయితే జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వర్షాలు కురిసే కాలం కాబట్టి, కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్లేట్‌లెట్స్‌ పేర దోపిడీ

డెంగ్యూ వ్యాధి సోకినపుడు మనిషిలో తెల్ల రక్తకణాలు (ప్లేట్‌లెట్స్‌) తగ్గుతాయి. సాధారణంగా 1.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు ఉంటే నార్మల్‌గా పరిగణిస్తారు. అంతకంటే తగ్గితే తెల్ల రక్తకణాలను ఎక్కించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్లేట్‌లెట్స్‌ ఎక్కిం చాలంటే ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇదే అదనుగా ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ సెం టర్లు, ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. ప్లేట్‌లెట్స్‌ నార్మల్‌గా ఉన్నప్పటికీ, తగ్గి నట్లు రిపోర్టులు సృష్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో ప్లేట్‌లెట్‌ యూనిట్‌ ధర రూ. 14 వేల నుంచి రూ. 16 వేల వరకు ఉంది. ఎక్కించడానికి అదనంగా యూనిట్‌కు రూ. 20వేల వరకు వసూలు చేస్తున్నారు.

ఎస్‌డీపీ ఉన్నా నిరుపయోగం

మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రిలో ప్లేట్‌లెట్లు ఎక్కించే ఎస్‌డీపీ (సింగిల్‌ డోనర్‌ ప్లేట్‌లెట్స్‌) యంత్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. రూ. 1 కోటి వ్యయంతో దీన్ని ఏర్పాటు చేసినా, కిట్లు లేక పోవడంతో ఆ యంత్రం మూలన పడింది. గత కొన్నే ళ్లుగా ప్రభుత్వం ఈ యంత్రానికి సంబంధించిన కిట్ల ను సరఫరా చేయడం లేదు. వాస్తవానికి ఒక్కో కిట్టు ధర రూ. 6 వేల నుంచి రూ. 7 వేల వరకు ఉంటుం ది. అంత పెద్ద మొత్తంలో కిట్లను ఇవ్వడానికి ప్రభు త్వం ముందుకు రావడం లేదు. దీంతో ఆ యంత్రం ఉన్నా నిరుపయోగంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్‌డీపీ కిట్లు మంజూరు చేస్తే ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది.

‘పేట’ జిల్లాలో గత ఏడాది 48 కేసులు

నారాయణపేట (ఆంధ్రజ్యోతి) : నారాయణపేట జిల్లాలో గత ఏడాది 48 కేసులు డెంగీ కేసులు నమో దయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో ప్రతీ సంవత్సరం కేసుల సంఖ్య పెరుగుతోంది. 2022లో 37, 2023లో 38 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు మూడు డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదె ౖనట్లు వైద్యాధికారులు తెలిపారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నట్లు చెప్పారు.

Updated Date - May 15 , 2025 | 10:49 PM