ఫుట్‌పాత్‌పై అక్రమ నిర్మాణాలు కూల్చివేత
ABN , Publish Date - May 14 , 2025 | 11:13 PM
జిల్లా కేంద్రంలో ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణా లను మునిసిపల్ అధికారులు కూల్చివేశారు.
- అడ్డుకున్న చిరు వ్యాపారులు
నాగర్‌కర్నూల్ టౌన్, మే 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణా లను మునిసిపల్ అధికారులు కూల్చివేశారు. బుధవారం పట్టణంలోని హౌసింగ్‌బోర్డుకాలనీ నుంచి నాగనూలు చౌరస్తా వరకు చిరు వ్యాపా రులు అక్రమంగా నిర్మించుకున్న షెడ్లను ఎక్స్‌క వేటర్‌తో పోలీసు బందోబస్తు నడుమ కూల్చి వేశారు. బస్టాండు ఎదురుగా ఉన్న జ్యూస్, పం డ్ల వ్యాపారుల షెడ్డును కూల్చి వేస్తున్న క్రమం లో చిరు వ్యాపారులు అధిక సంఖ్యలో గుమి గూడి అడ్డుకున్నారు. ఫుట్‌పాత్ మీద చిరు వ్యా పారం చేసుకుంటున్న తమను ఇక్కడి నుంచి తరిమేస్తే జీవనోపాధి ఎలా అని ప్రశ్నించారు. దీంతో మునిసిపల్ అధికారులు చేసేదేమి లేక ఇక్కడ నుంచి వైదొలిగి మిగతా వాటిని కూల్చి వేస్తూ ముందుకు సాగారు. దీంతో కొందరు చిరు వ్యాపా రులు అక్కడికి వచ్చి తమ షెడ్లను పూర్తిగా నేలమట్టం చేసిన మునిసిపల్ అధికారులు, మరి కొంత మంది షెడ్ల ను మొహం చూసి వదిలేయడం సమం జసం కాదని ముని సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై మునిసిపల్ అధికారుల వివరణ కోరగా ఫుట్‌పాత్ మీద ఉండాల్సిన చిరువ్యాపారులు అక్ర మంగా ముందుకు షెడ్లు నిర్మించుకున్నారని, దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోం దన్నారు. దీంతో మునిసిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నామని తెలి పారు. ప్రస్తుతానికి రోడ్డు మీదికి నిర్మించుకున్న షెడ్లను తొలగిస్తున్నామని, మున్ముందు పుట్‌పాత్‌లపై ఉన్న అక్రమ నిర్మాణాలను సైతం తొలగి స్తామని స్పష్టం చేశారు.