Demand to Pay Pending Salaries: ఆశ్రమ సీఆర్‌టీలకు వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:50 AM
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల(సీఆర్‌టీ)కు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని...
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల(సీఆర్‌టీ)కు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్‌టీలకు ఆరు నెలలుగా వేతనాలు నిలిచిపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని డీటీఎఫ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.