Koonneneni Sambashiva Rao: 17న సాయుధ పోరాట దినోత్సవం నిర్వహించాలి
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:21 AM
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవం పేరుతో ఈ నెల 17న ప్రభుత్వం వేడుకలు నిర్వహించాలని సీపీఐ...
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్/కవాడిగూడ, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవం పేరుతో ఈ నెల 17న ప్రభుత్వం వేడుకలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. భూమి కోసం, భుక్తి కోసం మట్టి మనుషులంతా ఏకమై దొరలు, భూస్వాములను తరిమికొట్టిన మహోత్తర ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని తెలిపారు. వీర తెలంగాణ పోరాట స్ఫూర్తిని నేటి తరాలకు అందించాల్సిన ప్రభుత్వాలు సమైక్య దినోత్సవం, ప్రజాపాలనా దినోత్సవం అంటూ రకరకాల పేర్లతో వేడుకలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. కాగా, తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సీపీఐ హైదరాబాద్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గురువారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న మగ్దూం మొయినుద్దీన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ట్యాంక్‌బండ్‌పై నుంచి లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వరకు అమరవీరులను స్మరించుకుంటూ ర్యాలీ నిర్వహించారు.
సీఎం రేవంత్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ లేఖ
తెలంగాణలో 1 నుంచి 10వ తరగతి వరకు చదివి, ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. వారికి నీట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అర్హత కల్పించాలని కోరారు.