kumaram bheem asifabad- ఉన్ని దుస్తులకు గిరాకీ
ABN , Publish Date - Nov 13 , 2025 | 10:16 PM
వారం రోజులుగా జిల్లాలో చలి తీవ్రత పెరుగడంతో ఉన్ని దుస్తులను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. చలి పరుగుతుండడంతో వెచ్చని నేస్తాలైన ఉన్ని దుస్తువుల కొనుగోలు కోసం ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వారం రోజులుగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు వణికిపోతు న్నారు. వాతావరణంలో జరుగుతున్న మార్పులు, ఈదురుగాలులతో క్రమేపి చలి తీవ్రతపై ప్రభావం పెడుతుంది.
కాగజ్‌నగర్/వాంకిడి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): వారం రోజులుగా జిల్లాలో చలి తీవ్రత పెరుగడంతో ఉన్ని దుస్తులను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. చలి పరుగుతుండడంతో వెచ్చని నేస్తాలైన ఉన్ని దుస్తువుల కొనుగోలు కోసం ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వారం రోజులుగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు వణికిపోతు న్నారు. వాతావరణంలో జరుగుతున్న మార్పులు, ఈదురుగాలులతో క్రమేపి చలి తీవ్రతపై ప్రభావం పెడుతుంది. దీంతో రోజు రోజుకు చలితీవ్రత పెరిగిపోతుంది. రాత్రి సమయంలో చలి తీవ్రత ఎక్కువ ఉండడం, జిల్లాలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు రాత్రి సమయంలో ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంటుంది. అడవులు, గుట్టల ప్రాంతాంలో మరింత అత్యల్ప ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. చల్లిని గాలులు వీస్తూ పగలు సైతం చలిపెడుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సాయంత్ర ఆరు గంటల తరువాత బయటకు వెళ్లడానికి ప్రజలు జంకుతున్నారు. దూరప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకుంటు న్నారు. ఉదయం చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో ప్రయాణా లు తగ్గిస్తున్నారు. చలి తీవ్రత పెరుగుతుండడంతో వృద్ధుల పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారింది. ఇంట్లో ఉన్నవారు సైతం స్వెట్టర్లు లేకుండా ఉండలేనంత చలి ప్రతాపం మొదలైంది. చలిని దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు స్వెట్టర్లు, దుప్పట్లు, పెద్దఎత్తున విక్రయిస్తున్నారు. పంజాబ్ నుంచి వీటిని కొనుగోలు చేసి రోడ్లకు ఇరువైపులా బైక్‌లపై ఇళ్ళవద్దనే విక్రయిస్తున్నారు. తక్కువ ధరలకు స్వెట్టర్లు, దుప్పట్లు అందుబాటులో వస్తుండడంతో ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు అసక్తి చూపుతున్నారు. కాగజ్‌నగర్‌లో ఢిల్లీ నుంచి రూ.200 నుంచి రూ.2000 వరకు స్వెట్టర్లు, శాలువాలు తెప్పించారు. పట్టణంలోని పదిహేనుకుపైగా వివిధ దుకాణాల్లో అమ్మకాలు జరుపుతున్నారు. చిన్నారులను ఆకర్షించేలా పలుచోటాబీమ్, డోరేమాన్, చిన్‌చాన్, లిటిల్ సింగం తదితర రకాల జంతువుల బొమ్మలతో కూడిన స్వెట్టర్లు అమ్మకానికి పెట్టారు. అలాగే విధంగా మహిళలు, వృద్దులు, యువతకు అనుకూలమైన బటన్, జిప్, బనియన్, టైర్ రకాల వివిధ రంగుల్లోని స్వెట్టర్లు అమ్ముతున్నారు. గత మూడురోజుల నుంచి ఈ వ్యాపారం ఊపందుకుంది.