Lie Detector Tests: కేసీఆర్ కుటుంబానికి లైడిటెక్టర్ పరీక్షలు చేయాలి
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:06 AM
హరీశ్‌రావు, సంతో్‌షరావు సహా కేసీఆర్ కుటుంబ సభ్యులందరికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని..
ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఎ. ఫహీం డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): హరీశ్‌రావు, సంతో్‌షరావు సహా కేసీఆర్ కుటుంబ సభ్యులందరికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఎ. ఫహీం కోరారు. అప్పుడే పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన కుంభకోణాలన్నీ బయటకొస్తాయని చెప్పారు. సవాళ్లు విసరడానికి బదులు హరీశ్‌రావు, సంతో్‌షరావులపై కవిత చేసిన అవినీతి ఆరోపణలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.