Share News

BC Reservations: బీసీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లే కావాలి

ABN , Publish Date - Oct 12 , 2025 | 03:57 AM

బీసీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లే కావాలని.. పార్టీల పరమైన రిజర్వేషన్లు వద్దని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్‌...

BC Reservations: బీసీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లే కావాలి

  • కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే

  • బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): బీసీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లే కావాలని.. పార్టీల పరమైన రిజర్వేషన్లు వద్దని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్‌ వ్యాఖ్యానించారు. రాజ్యాంగపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. శనివారం సచివాలయం మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. 50 శాతం రిజర్వేషన్‌ పరిమితిని ఎత్తి వేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి షెడ్యూల్‌ తొమ్మిదిలో చేర్చే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. హైకోర్టు ేస్టను కారణంగా చూపుతూ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కట్టబెడతామని మభ్యపెట్టే మాటలు వద్దని అన్నారు. బీసీలను రాజకీయ బానిసత్వం నుంచి విముక్తం చేేస దిశగా ఇకపై మరింత బలమైన అడుగులు వేస్తామని తెలిపారు. ఐక్య కూటమి పోరాటంతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బీసీ రాజకీయ ఆకాంక్షల కోసం ప్రజా ఐక్య కూటమి సమర శంఖం పూరించినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కమిటీ సెక్రటరీ వీరేందర్‌ గౌడ్‌, యువజన వింగ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మడత కిషోర్‌, రిటైర్డ్‌ ప్రభుత్వ అధికారి ప్రసన్న, గ్రేటర్‌ హైదరాబాద్‌ మహిళా అధ్యక్షురాలు బండారు పద్మావతి, రాష్ట్ర కమిటీ సభ్యులు సరస్వతి, వంగ రవి యాదవ్‌, లక్ష్మణ్‌, మదన్‌ యాదవ్‌, లక్ష్మి, జ్యోతి మాదేవి, భాగ్యలక్ష్మి, వరుణ్‌, సాయి పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 03:58 AM