BC Reservation: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:04 AM
పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు తదితర డిమాండ్లతో ..
బీజేపీతోనే బీసీ సాధికారత: కృష్ణయ్య
రాంనగర్/న్యూఢిల్లీ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు తదితర డిమాండ్లతో ఢిల్లీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం భారీ ప్రదర్శన నిర్వహించింది. వందలాది మంది సర్పంచులు, జెడ్‌పీటీసీలు, ఎంపీటీసీలు, బీసీ సంఘాల నేతలు తరలిరావడంతో జంతర్‌మంతర్ దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీజేపీతోనే బీసీ సాధికారత సాధ్యమని చెప్పారు. బీజేపీ బీసీని ప్రధానిని, 27 మందిని మంత్రులను, నలుగురు గవర్నర్లను, ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిందని గుర్తు చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేశ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు.