Share News

Ex Justice V Eshwarayya Goud and BC leaders criticized: జీవోలతో రాజకీయ పార్టీలు డ్రామాలు

ABN , Publish Date - Oct 14 , 2025 | 02:50 AM

బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ పరమైన రక్షణలు ఏర్పాటు చేయకుండా జీవోలతో రాజకీయ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయిని జాతీయ బీసీ కమిషన్‌ మాజీ...

Ex Justice V Eshwarayya Goud and BC leaders criticized: జీవోలతో రాజకీయ పార్టీలు డ్రామాలు

  • జీవోలకు చట్టబద్ధత ఉండదు.. కోర్టులు కొట్టివేస్తాయి

  • 42%రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లొద్దు

  • 50% పరిమితి రాజ్యాంగంలో లేదు

  • బీసీ సంఘాల సమావేశంలో వక్తలు

  • బీసీ రిజర్వేషన్ల కోసం సాధన సమితి

  • 24న ఇందిరాపార్కు వద్ద భారీ సభ

పంజాగుట్ట, ఆక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ పరమైన రక్షణలు ఏర్పాటు చేయకుండా జీవోలతో రాజకీయ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయిని జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య గౌడ్‌ అన్నారు. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, విద్యా, ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ముసాయిదా బిల్లులో పేర్కొన్నా.. దానిని అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ బీసీ పొలిటికల్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన- ఉద్యమ కార్యాచరణ’పై సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫ్రంట్‌ రాష్ట్ర కన్వీనర్‌ అయిలి వెంకన్న గౌడ్‌ అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బీసీ సంఘాలు, బీసీ మేధావుల ఫోరం తదితరులు 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం సాధన సమితిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24న ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విశ్రాంత ఐఏఎస్‌ టి.చిరంజీవులు మాట్లాడుతూ.. గతంలో చాలా రాష్ట్రాలు జీవోలతో రిజర్వేషన్లు తెచ్చే ప్రయత్నించినా.. కోర్టులు కొట్టివేశాయని, దీంతో 9వ షెడ్యూల్లో చేర్చడం ఒకటే దానికి పరిష్కార మార్గమన్నారు. బీసీలకు 42ు రిజర్వేషన్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పోవద్దన్నారు. బీఆర్‌ఎ్‌సకు అవకాశం ఉన్నా కూడా బీసీలకు రిజర్వేషన్‌ కల్పించలేదని విమర్శించారు. విశారదన్‌ మహారాజ్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ రేవంత్‌రెడ్డిని ప్రతి వారం ఢిల్లీకి తీసుకెళ్లాలని, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ప్రధానితో మాట్లాడి తొమ్మితో షెడ్యూల్‌లో చేర్పించాలని డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని సమావేశంలో పాల్గొన్న వక్తలు అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కలిసి వచ్చే బీసీ, కుల సంఘాల నేతలనూ కలుపుకుని పోరాటం చేస్తామని తెలిపారు. తమ ఓటు తామే వేసుకుందామని ప్రతిజ్ఞ చేశారు.

Updated Date - Oct 14 , 2025 | 02:50 AM