Bathukamma Festival: ప్రకృతితో మమేకమయ్యే పండుగే బతుకమ్మ
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:26 AM
మాతృత్వం, ప్రకృతితో మమేకమయ్యే పండుగ బతుకమ్మ అని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యానించారు. ఇది కేవలం పూల పండుగే కాదని..
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రామజస్ కాలేజీలో వేడుకలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మాతృత్వం, ప్రకృతితో మమేకమయ్యే పండుగ బతుకమ్మ అని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యానించారు. ఇది కేవలం పూల పండుగే కాదని.. జీవన సౌందర్యానికి ప్రతీక అని అన్నారు. శనివారం ఢిల్లీలోని రామజస్ కాలేజీలో తెలుగు విద్యార్థి సంఘం నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో రేఖాగుప్తా, సీఎ్‌సఆర్ అపోలో హాస్పిటల్స్ వైస్‌చైర్మన్ ఉపాసన కొణిదెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం రేఖా గుప్తా మాట్లాడుతూ ఢిల్లీలో స్థిరపడిన తెలుగు సమాజం.. తమ కష్టం, ప్రతిభతో నగరాన్ని తీర్చిదిద్ది ఇక్కడి సంస్కృతికి కొత్త రంగులు అద్దిందని కొనియాడారు. ఇక్కడికి వచ్చిన వేలాది మంది విద్యార్థుల ఉత్సాహం, వారి భాగస్వామ్యం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.