Bandi Vijayalakshmi: ఆమె ఓడిపోయినా మాట నిలబెట్టుకున్నారు
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:48 AM
ఎన్నికల్లో ఓడిపోతేనేం.. ప్రజలకు ఇచ్చిన మాటను ఆ మహిళా అభ్యర్థి నిలబెట్టుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్కీ....
కౌటాల, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఓడిపోతేనేం.. ప్రజలకు ఇచ్చిన మాటను ఆ మహిళా అభ్యర్థి నిలబెట్టుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్కీ గ్రామంలో బండి విజయలక్ష్మి సర్పంచ్‌గా పోటీచేశారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే గ్రామంలోని ఆలయం ఆవరణలో బోరు వేయిస్తానని ఆమె గ్రామస్థులకు హామీ ఇచ్చారు. అయితే ఆమె 171 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆమెకు మద్దతు తెలిపిన వారంతా కలిసి ఆలయ ఆవరణలో బోరు వేయించగా, విజయలక్ష్మి మోటారు కొనుగోలు చేసి ఇచ్చారు.