Demanding Votes Return: డబ్బులు తిరిగిచ్చేయండి..పసుపు, బియ్యమన్నా పట్టుకోండి
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:30 AM
ఇదీ.. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాలాజీఅనుకోడలో ఓడిపోయిన అభ్యర్థి వగాడి శంకర్ అనే వ్యక్తి పంతం....
కౌటాల(చింతలమానేపల్లి), డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఇదీ.. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాలాజీఅనుకోడలో ఓడిపోయిన అభ్యర్థి వగాడి శంకర్ అనే వ్యక్తి పంతం! తాను డబ్బులిచ్చినా ఓటు వేయలేదని ఆరోపిస్తూ ఆయన ప్లేటులో పసుపు, బియ్యం వేసుకొని కుటుంబసభ్యులతో కలిసి ఇంటింటికీ తిరిగారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీచేసిన శంకర్ ఎన్నికల్లో ఓడిపోయారు. పసుపు, బియ్యం పట్టుకున్నవాళ్లు తనకు ఓటు వేసినట్లుగా నమ్ముతానని.. పట్టుకోనివారు తానిచ్చిన డబ్బులు తిరిగిచ్చేయాలని శంకర్ అంటున్నారు.