TGOA: టీజీవో మహిళా శాఖ చైర్‌పర్సన్‌గా దీపారెడ్డి
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:53 AM
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం మహిళా శాఖకు ఎన్నికలు నిర్వహించగా ఒకే సెట్ నామినేషన్ దాఖలు కావడంతో...
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం మహిళా శాఖకు ఎన్నికలు నిర్వహించగా ఒకే సెట్ నామినేషన్ దాఖలు కావడంతో ఆ సంస్థ అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటించారు. చైర్మన్‌గా జి.దీపారెడ్డి, కన్వీనర్‌గా జక్కంపూడి సుజాత, కోశాధికారిగా శాంతిశ్రీ ఎన్నికయ్యారని వెల్లడించారు. వారికి ఆయన నియామక పత్రాలు అందించి ప్రమాణం చేయించారు. ఈమేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తదుపరి జరిగిన కార్యవర్గ సమావేశంలో మహిళా శాఖ చైర్మన్ జి.దీపారెడ్డి అధ్యక్షతన పలు తీర్మానాలను కార్యవర్గం ఆమోదించింది.