Share News

kumaram bheem asifabad- దీపారాధన..తులసి పూజలు

ABN , Publish Date - Nov 05 , 2025 | 10:50 PM

జిల్లాలో శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం మహిళలు దీపారాధన, తులసి పూజలు నిర్వహించారు. తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుందని, దీపారాధన చేయడం ద్వారా దుష్టశక్తులు దూరమవుతాయని భావిస్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శివాలయాల్లో పౌర్ణమి వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు.

kumaram bheem asifabad- దీపారాధన..తులసి పూజలు
వాంకిడి చికిలి వాగులో దీపాలు వదులుతున్న మహిళలు

- కిటకిటలాడిన ఆలయాలు

ఆసిఫాబాద్‌రూరల్‌/వాంకిడి/పెంచికలపేట/రెబ్బెన/బెజ్జూరు/కెరమెరి/ద హెగాం/సిర్పూర్‌(యు), నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం మహిళలు దీపారాధన, తులసి పూజలు నిర్వహించారు. తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుందని, దీపారాధన చేయడం ద్వారా దుష్టశక్తులు దూరమవుతాయని భావిస్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శివాలయాల్లో పౌర్ణమి వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఊరంతా కార్తీక పౌర్ణమి సందడి కనిపించింది. తెల్లవారుజామునే జిల్లా కేంద్రంలోని శివాలయాల్లోకి వెళ్లి అభిషేకాలు, క్షీరాభిషేకాలు, రుద్రాభిషేకాలు చేశారు. భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాలు, తులసి పూజలు, నోములను భక్తులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆలయాలకు. తెల్లవారు జాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తులు పట్టణ సమీపంలని పెద్దవాగులో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలో భక్తి శ్రద్ధలతో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయం వెలుపల కార్తీక దీపాలు వెలిగించారు. దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పట్టణంలోని ఆర్యవైశ్యులు దేవుడి చిత్రపటాలతో వాసవి ఆలయం నుంచి పలు వీధుల గుండా నగర సంకీర్తన నిర్వహించారు. అలాగే పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వాంకిడి మండల కేంద్రంలోని శివాలయం, హనుమాన్‌ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు నిర్వహించారు. మహిళలు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి చికిలి నదిలో వది లారు. పెంచికలపేట మండలంలోని పలు శైవక్షేత్రాలు, రామాలయాలు, హనుమాన్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో దీపాలు వెలిగించారు. అలాగే ఇళ్ల వద్ద తులసి, ఉసిరిక చెట్లకు పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు. రెబ్బెన మండలం ఇందిరానగర్‌ గ్రామంలో కనక దుర్గాదేవి స్వయంభు శ్రీ మహంకాళి దేవస్థానంలో అమ్మవారకి, కాల బైరవ స్వామికి, అరుణాచల శివుడికి, కనీశ్వరస్వామికి, గర్భగుడిలో ఉన్న మహంకాళి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీపారాధన చేసి ఉసిరి దీపాలతో హరతులిచ్చి నైవేద్యాలు సమర్పించారు. బెజ్జూరు మండలంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండల కేంద్రంలోని రంగనాయక శివాలయం, హనుమాన్‌, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఆలయాల్లో ఉసిరక, తులసీ మొక్కలకు వత్తులు దీపాలు వెలిగించి పూజలు చేశారు. కెరమెరి మండల కేంద్రంలోని శివాలయంలో వేదపండితులు బాపుదేవ్‌ కులకర్ణి ప్రత్యేక పూజలు చేపట్టారు. గోయగాం గ్రామంలోని శివాలయంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకుడు శంకర్‌ మహారాజ్‌ ప్రత్యేక పూజలు చేశారు. మండల వ్యాప్తంగా గ్రామాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లలో ప్రత్యేక తులసీ పూజలు చేపట్టి సమీప జలాశయాల్లో, వాగుల్లో దీపాలు వదిలారు. దహెగాం. మండలంలో ఉదయం నుంచే ఆలయాల్లో భక్తులతో సందరడి నెలకొన్నది. మండలంలోని శివకేశవాలయం, అయినం శివపంచాయతన క్షేత్రం, లగ్గాం ఉమాచంద్రశేఖర ఆలయంలో భక్తులు తులసి, ఉసిరిక చెట్లకుప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు. అనంతరం ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని శివకేశవ ఆలయంలో సాయంత్రం దీపోత్సవం నిర్వహించారు. సిర్పూర్‌(యు) మండలంలోని ప్రజలు ఆలయలల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలో గల గోండు రాజుల కాలం నాటీ అతి ప్రాచీనమైన మహదేవ్‌ ఆలయంలో భక్తులు బుధవారం ఉదయం నుంచే భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లలు, మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు.

Updated Date - Nov 05 , 2025 | 10:50 PM