Share News

తెలంగాణ ఆత్మ ప్రతిబింబించేలా దీక్షా దివస్‌

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:11 PM

లంగాణ ఆత్మ ప్ర తిబింబించేలా శ నివారం పార్టీ జిల్లా కార్యాల యంలో దీక్షా దివస్‌ కార్యక్ర మం నిర్వహించ నున్నట్లు మాజీ ఎమ్మెల్యే మర్రి జనా ర్ద న్‌రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ ఆత్మ ప్రతిబింబించేలా దీక్షా దివస్‌
ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

- ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఆత్మ ప్ర తిబింబించేలా శ నివారం పార్టీ జిల్లా కార్యాల యంలో దీక్షా దివస్‌ కార్యక్ర మం నిర్వహించ నున్నట్లు మాజీ ఎమ్మెల్యే మర్రి జనా ర్ద న్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కొల్లాపూర్‌ చౌరస్తాలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల తో సమావేశమైన ఆయన దీక్షా దివస్‌ను విజ యవంతం చేసేందుకు కార్యాచరణను రూపొం దించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. ఉదయం 10గంటలకు తెలంగా ణ రాష్ట్ర సాధనోద్యమ నేత కేసీఆర్‌ చిత్రపటా నికి క్షీరాభిషేకం చేసిన అనంతరం కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులకు సంబంధించిన అన్ని విభాగాల శ్రేణులంతా హా జరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మర్రి జనార్దన్‌రెడ్డి వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు అర్థం రవి, తిమ్మాజిపేట పాండు, మంతటి నాగయ్య, ఆలూరి నరేందర్‌, బాబు రావు, ఎలిమే సత్యం, సురేందర్‌, గంగాధర్‌, మాజీ సింగిల్‌విండో చైర్మన్‌ వెంకట్రాములు, ఖాజాఖాన్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 11:11 PM